సీఎం ఎఫెక్ట్, గూండా చట్టం కేసులో హిందూ సంఘం లీడర్ అందర్, ఏడాది క్లీన్ బౌల్డ్!
బెంగళూరు/హాసన్: కర్ణాటక రాష్ట్ర రక్షణ సంఘం సంస్థ నాయకుడు పునీత్ కుమార్ అలియాస్ పునీత్ కెరెహళ్లిని బెంగళూరు సీసీబీ పోలీసులు గూండా యాక్ట్ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు. బెంగుళూరులోని జేపీ నగర్‌లో నివసించిన పునీత్ కెరెహళ్లి సొంత ఊరు హాసన్. నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ పేరుతో ఓ సంస్థను నడుపుతున్నాడని, ఆ సంస్థ ద్వారా గోసంరక్షణ, మత పరిరక్షణ పేరుతో వ్యాపారులను బెదిరిస్తున్నాడని పోలీసులు అంటున్నారు.
దేశ రక్షణ పేరుతో పలుమార్లు ప్రజలను బెదిరించడం, సమాజ శాంతికి భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడని పునీత్ మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. గత పదేళ్లుగా సమాజంలో సామరస్యానికి భంగం కలిగించిన క్రిమినల్ కార్యకలాపాలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించాడని పునీత్ కుమార్ మీద క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల ఆధారంగా పునీత్ కెరెహళ్లిపై గూండా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

చాలా నెలలుగా ఈ సమాచారాన్ని దాచిపెట్టిన పోలీసులు శుక్రవారం అర్థరాత్రి పునీత్ కెరెహళ్లి అరెస్టుపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమాచారం ఇచ్చింది. పునీత్ కుమార్ మీద బెంగళూరులోని డీజే హళ్లి, బేగూర్, కగ్గలిపూర్, హలసూరు గేట్, చామరాజ్‌పేట, సహా పలు స్టేషన్లలో కేసులు నమోదైనాయని పోలీసు అధికారులు అంటున్నారు. ఎలక్ట్రానిక్ సిటీ, మలవల్లి, సాతనూరులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డాడని పునీత్ కుమార్ మీద గూండా చట్టం కింద కేసులు నమోదు చేశారు.
పునీత్ కెరెహళ్లికి 2013 నుంచి 2023 వరకు పది కేసుల్లో ప్రమేయం ఉందని, పలుమార్లు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ బెంగళూరు సీసీబీ పోలీసులు గూండా యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పునీత్ కెరెహళ్లిని శుక్రవారం అర్దరాత్రి జేపీ నగర్ లో బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు.
కొన్ని నెలల క్రితం పునీత్ కెరెహళ్లి పశువులను నడుపుతున్న ముస్లిం వ్యాపారినిని పట్టుకునిన కారులో బంధించి విద్యుత్ షాక్ మెషీన్‌తో షాక్‌కు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముస్లిం వ్యాపారి ఇద్రీష్ పాషాకు పునీత్ కెరెహళ్లి విద్యుత్ షాక్ ఇస్తున్న వీడియోను పునీత్ కెరెహళ్లి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చెయ్యడంతో అది వైరల్ అయ్యిందని పోలీసులు అంటున్నారు. అనంతరం పునీత్ కుమార్ పై కేసు నమోదు చేశారు.
గూండా చట్టం కింద అరెస్టయిన వ్యక్తిని ఇతర కేసుల్లో మాదిరిగా 24 గంటల్లోగా న్యాయమూర్తి ముందు హాజరుపరచాల్సిన అవసరం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. అలాంటి నిందితులు కోర్టులో ఒక సంవత్సరం పాటు బెయిల్ పొందలేరు. మొత్తం మీద కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతకాలం రెచ్చిపోయిన కొందరి మీద పోలీసు కన్నువేశారు.












Click it and Unblock the Notifications