శ్రీరామనవమి సందర్భంగా బెంగళూరు నగర వ్యాప్తంగా మాంసం విక్రయాలపై నిషేధం
బెంగళూరు: శ్రీరామనవమి సందర్భంగా బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 10న బెంగళూరు అంతటా మాంసం విక్రయాలను నిషేధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
బీబీఎంపీ పరిధిలోని మాంసం దుకాణాలు, కబేళాలు ఆదివారం మూసి ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో మహా శివరాత్రి, గణేష్ చతుర్థి నాడు మాంసం విక్రయాలను నిషేధించారు.
ఏప్రిల్ 4న, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (SDMC) మేయర్ ముఖేష్ సూర్యన్.. నవరాతి పండుగ చివరి రోజైన ఏప్రిల్ 11 వరకు SDMC పరిమితుల్లోని అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని SDMC కమిషనర్‌ను కోరారు.

నవరాత్రుల సమయంలో, ఢిల్లీలోని మెజారిటీ కుటుంబాలు వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా తినరని సూర్యన్ ఉదహరించారు, అందువల్ల "సాధారణ ప్రజల మనోభావాలు, భావాలను దృష్టిలో ఉంచుకుని" మాంసం దుకాణాలను మూసివేయడానికి అవసరమైన ఆదేశాలు జారీ చేయబడవచ్చు.
ఇదిలా ఉండగా, నవరాత్రి పండుగ సందర్భంగా నగరంలో మాంసం దుకాణాలను మూసివేయడం సామరస్యాన్ని పెంపొందిస్తుందని తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్యామ్ సుందర్ అగర్వాల్ అన్నారు.












Click it and Unblock the Notifications