RTC బస్సుల్లో ఫ్రీ ఫ్రీ ఫ్రీ, వారంలో ఎన్ని లక్షల మంది లేడీఎస్ ఫ్రీగా తిరిగేశారంటే?

బెంగళూరు/మంగళూరు/బళ్లారి: కర్ణాటక ప్రభుత్వం కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళల నుంచి విశేషమైన మద్దతు లభించింది. ఈ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రైళ్లు, ప్రైవేట్ బస్సుల్లో కాకుండా కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. జూన్ 11వ తేదీ నుండి జూన్ 18వ తేదీ వరకు మంగళూరు డివిజన్ లో మాత్రమే ఎంత మంది మహిళలు ప్రయాణించారు అనే విషయం వెలుగు చూసింది.

కర్ణాటక ప్రభుత్వ కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అదేవిధంగా మంగళూరు డివిజన్ కేఎస్‌ఆర్‌టీసీలో రెండు జోన్లు అంటే కుందాపూర్, ఉడిపి జోన్‌లు వస్తాయి. ఇలా అన్ని రంగాల్లో శక్తి పథకంలో భాగంగా మహిళలు ఉచితంగా ఊర్లు తిరిగేస్తున్నారు.

Bengaluru: How many lakhs of women have traveled for free in KSRTC buses in a week?

జూన్ 11వ తేదీ ప్రథమార్థంలో ఈ నాలుగు మండలాల్లో 5,454 మంది మహిళలు బస్సులో ప్రయాణించగా, వీరి నుంచి కేసీఆర్‌కు ప్రథమార్థంలో రూ.1,90,155 ఆదాయం వచ్చింది. జూన్ 12వ తేదీ మొత్తం రోజు మంగళూరు డివిజన్‌లో ప్రభుత్వ బస్సుల్లో 30,404 మంది మహిళలు ప్రయాణించగా, కేఎస్ ఆర్ టీసీకీ రూ.12,31,753 ఆదాయం వచ్చింది.

జూన్ 13న మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయింది. ఆ రోజు మొత్తం 48,722 మంది మహిళలు ప్రయాణించగా, వీరి నుంచి కేఎస్ ఆర్‌ టీసీకు రూ.17,79,720 ఆదాయం వచ్చింది, జూన్ 14న మహిళా ప్రయాణికుల సంఖ్య యాభై వేల మార్కును దాటింది.. మొత్తం 57,329 మంది మహిళా ప్రయాణికులు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించగా రూ.20, 21,008 ఆదాయం వచ్చింది.

Bengaluru: How many lakhs of women have traveled for free in KSRTC buses in a week?

జూన్ 15వ తేదీన 61,244 ప్రభుత్వ బస్సులో మహిళా ప్రయాణికులు ప్రయాణించడంతో కేఎస్ ఆర్ టీసీకి రూ.21,13,824 ఆదాయం వచ్చింది. జూన్ 16వ తేదీన మహిళా ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగింది. ప్రభుత్వ బస్సులో మొత్తం 63,715 మంది మహిళలు ప్రయాణించగా రూ.21, 94, 459 ఆదాయం వచ్చింది. జూన్ 17న రికార్డు స్థాయిలో మహిళా ప్రయాణికులు ప్రయాణించారు.

ఆర్ టీసీ బస్సుల్లో మొత్తం 67, 298 మంది మహిళా ప్రయాణికులు ప్రయాణించగా రూ.24, 20,509 ఆదాయం సమకూరింది. జూన్ 18న ప్రభుత్వ బస్సుల్లో 51, 763 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. మహిళలు ఉచితంగా కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో ప్రయాణించడంతో కేఎస్‌ఆర్‌టీసీకి బోలెడంత ఆదాయం వస్తోందని, కోస్తాలోని మహిళలు ప్రభుత్వ బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణించడంతో కేఎస్ఆర్ టీసీ ఆదాయం పెరుగుతోందని సంబంధిత అధికారులు అంటున్నారు.

Bengaluru: How many lakhs of women have traveled for free in KSRTC buses in a week?

ఒక వారం పాటు ఉచిత ప్రయాణానికి కోటి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి కేఎస్ఆర్ టీసీకి రావాలని మంగళూరుకు చెందిన ఓ అధికారి అంటున్నారు. శక్తి పథకంలో భాగంగా కర్ణాటక ప్రభుత్వ బస్సులు పూర్తి రద్దీతో నడుస్తున్నాయి. ప్రభుత్వ బస్సుల్లో 85% మహిళా ప్రయాణికులతో నిండిపోగా, ప్రతిరోజూ సగటున 50 వేల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కేఎస్ఆర్ టీసీ ప్రతి రోజు 25 లక్షల రూపాయలు సంపాదిస్తోంది.

అదేవిధంగా మంగళూరు డివిజన్‌లో రోజుకు 303 ప్రభుత్వ బస్సులు మహిళలకు ఉచితంగా సేవలు అందిస్తున్నాయి. అంతకుముందు ప్రైవేట్ బస్సులు ఫుల్ రష్ గా వుండగా మిగిలిన ప్రయాణికులు ప్రభుత్వ బస్సుల్లో వచ్చేవారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ బస్సులు కూడా నిండాయని, మిగిలిన ప్రయాణికులు ప్రైవేట్ బస్సులకు వెళ్తున్నారని మంగళూరు డివిజన్ కంట్రోలర్ రాజేష్ శెట్టి స్థానిక మీడియాకు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+