Race View: సీఎం ఇంట్లోకి మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్, కొత్త ఇంట్లో, ఎవరి జాగ్రత్తలు వాళ్లవి, ముందు జాగ్రత !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సీఎం హోదాలో ఉండటానికి ప్రభుత్వం రేస్ వ్యూ 1 ఇంటిని కేటాయించింది. ముఖ్యమంత్రి హోదాలో బసవరాజ్ బోమ్మయ్ కొత్త ఇంటిలో అడుగుపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. కర్ణాటక హోమ్ మంత్రి హోదాలో ఉన్న సమయంలో బసవరాజ్ బోమ్మయ్ బెంగళూరులోని ఆర్ టీ నగర్ లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే హోమ్ మంత్రి నుంచి ముఖ్యమంత్రిగా ప్రమోషన్ కొట్టేసిన బసవరాజ్ బోమ్మయ్ రేస్ వ్యూ 1 ఇంటిలో ఉండటానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఇంటిలో ఎవరు వెళ్లాలన్నా ఇక ముందు మొబైల్ ఫోన్లు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుల దగ్గర ఇచ్చేసి వెళ్లాలి. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ నివాసం ఉండబోతున్న ఇంటి గేట్ బయట ఇప్పటికే అధికారులు మొబైల్ నాట్ అలౌడ్ అని పెద్దగా రాసిన బోర్డు ఏర్పాటు చేశారు. ఎవరి జాగ్రత్తల్లో వారు ఉంటే అందరికి మంచిదని అధికారులు సీఎం ఇంటి దగ్గర ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఆర్ టీ నగర్ లో సీఎం
కర్ణాటక హోమ్ మంత్రి హోదాలో ఉన్న సమయంలో బసవరాజ్ బోమ్మయ్ బెంగళూరులోని ఆర్ టీ నగర్ లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే హోమ్ మంత్రి నుంచి ముఖ్యమంత్రిగా ప్రమోషన్ కొట్టేసిన బసవరాజ్ బోమ్మయ్ బెంగళూరులోని రేస్ వ్యూ -1 ఇంటిలో ఉండటానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇల్లు ఖాళీ చేసిన అశ్వథ్ నారాయణ
యడియూరప్ప మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, కర్ణాటక ఐటీ శాఖా మంత్రిగా పని చేసిన డాక్టర్ అశ్వథనారాయణ ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖా మంత్రిగా పని చేస్తున్నారు. రేస్ వ్యూ-1 ఇంటిని గతంలో డాక్టర్ అశ్వథనారాయణకు కేటాయించారు. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి ఆ ఇంటిని కేటాయించడంతో డాక్టర్ అశ్వథనారాయణ రేస్ వ్యూ-1 ఇంటిని ఖాళీ చేశారు.

రంగంలోకి దిగిన అధికారులు
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సీఎం హోదాలో ఉండటానికి ప్రభుత్వం బెంగళూరులోని రేస్ వ్యూ- 1 ఇంటిని కేటాయించింది. ముఖ్యమంత్రి హోదాలో బసవరాజ్ బోమ్మయ్ కొత్త ఇంటిలో అడుగుపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. మంచి ముహూర్తం చూసి బసవరాజ్ బోమ్మయ్ రేస్ వ్యూ-1 ఇంటిలో అడుగు పెట్టడానికి సిద్దం అయ్యారు.

ఎవరి జాగ్రత్తల్లో వారు ఉంటే మంచిది
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఇంటిలో ఎవరు వెళ్లాలన్నా ఇక ముందు మొబైల్ ఫోన్లు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుల దగ్గర ఇచ్చేసి వెళ్లాలి. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ నివాసం ఉండబోతున్న ఇంటి గేట్ బయట ఇప్పటికే అధికారులు మొబైల్ ఫోన్లు నాట్ అలౌడ్ అని పెద్దగా రాసిన బోర్డు ఏర్పాటు చేశారు. ఎవరి జాగ్రత్తల్లో వారు ఉంటే అందరికి మంచిదని అధికారులు సీఎం ఇంటి దగ్గర ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు గతంలో కేటాయించిన కావేరి ఇంటిని అలాగే వదిలిపెట్టారు. కావేరి నివాసంలో యడియూరప్ప ఉంటారని, అందుకే ఆ ఇంటి జోలికి అధికారులు వెళ్లడం లేదని సమాచారం.












Click it and Unblock the Notifications