బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్లౌడ్ బరస్ట్: రాత్రంతా కుండపోత - రికార్డు వర్షపాతం..!!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సిలికాన్ సిటీ బెంగళూరులో అతి భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి మొదలైన వర్షం తెల్లవారు జాము వరకు ఏకధాటిగా కుండపోతగా దంచికొట్టింది. కొన్ని గంటల వ్యవధిలోనే రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు పోటెత్తింది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వీకెండ్ సెలవులను ముగించుకుని నగరానికి వచ్చిన కదల్లేని స్థితి ఏర్పడింది. క్లౌడ్ బరస్ట్ తరహా వాతావరణ పరిస్థితుల వల్ల సంభవించిన వర్షంగా అధికారులు అంచనా వేస్తోన్నారు.

కుండపోతగా..

ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో ఆరంభమైన వర్షం సోమవారం తెల్లవారు జాము వరకూ ఏకధాటిగా కురిసింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని ఈస్ట్, నార్త్, సౌత్ జోన్లల్లో వర్షం తీవ్రత అధికంగా కనిపించింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. ఆడుగోడి, టన్నేరి రోడ్ ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లడంతో మురుగునీరు రోడ్లపై పోటెత్తింది.

భారీ వర్షాలతో..

ఈస్ట్‌జోన్ పరిధిలోని వైట్‌ఫీల్డ్‌లో అత్యధికంగా 175 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తవరెకెరె-172, సంపంగిరామనగర-148.50 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్ట్-142, వర్తూరు-141, పులకేశినగర-139, గుట్టహళ్లి-138, దొడ్డనెక్కుండి-133.50, మార్థహళ్లి-129, కొనెన అగ్రహార-114.50, విద్యాపీఠ-114, హంపీ నగర-104, విశ్వేశ్వరపురం-98, హొరమావు-94, బెళ్లందూరు-89, కొట్టిగెపాళ్య-89, యలహంక-87 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది.

ఇళ్లల్లో వర్షపునీరు..

వైట్‌ఫీల్డ్, గొట్టిగెరె, బన్నేరుఘట్ట రోడ్, విజయనగర, రాజాజీనగర, బసవేశ్వర నగర, యశ్వంతపూర్, పీణ్య, లగ్గెరె, నందిని లేఅవుట్, మల్లేశ్వరం, శేషాద్రిపురం, హెబ్బాళ, సంజయ్ నగర, ఆర్టీ నగర్, నాగవార, హెన్నూర్, బాణస్వాడి, రాజరాజేశ్వరి నగర్, దీపాంజలి నగర్, చామరాజపేట వంటి ప్రాంతాల్లో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. రోడ్లపై పార్క్ చేసివున్న వాహనాలు మునిగిపోయాయి. మెజస్టిక్, ఓకళిపుర, కస్తూరినగర, శివాజీనగర అవెన్యూ రోడ్ వంటి చోట్ల రోడ్లపై మూడడుగుల మేర వర్షపునీరు నిలిచింది.

బేస్‌మెంటల్లో

ఆయా ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్లు వర్షపునీటితో నిండిపోయాయి. కొన్ని గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఎటూ కదల్లేని స్థితిని ఎదుర్కొన్నారు వాహనదారులు. రోడ్ల పక్కన షెల్టర్లల్లో జాగారం చేశారు. బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా దీని ప్రభావం పడింది. క్యాబ్స్ సకాలంలో రాలేకపోవడంతో వందలాదిమంది ప్రయాణికులు అక్కడే పడిగాపులు కాశారు.

English summary
The Bengaluru have flooded once again after torrential rains pounded the city on Sunday night, in what may turn out to be a cloudburst on the wettest day on record for the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X