అటకెక్కిన అమిత్ షా రోడ్ షో, అపశకునం అంటూ ప్రచారం, ఉరుములు, మెరుపులు!
బెంగళూరు/దేవనహళ్లి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని పక్కాప్లాన్ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు రోడ్ షోలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా ఎన్నికల ప్రచారంలో లబ్దిపొందాలని అన్ని పార్టీల నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీతో 20 ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలని బీజేపీ నాయకులు పక్కాప్లాన్ చేశారు. కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాతో కూడా బహిరంగ సభ్యులు నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారం సందర్బంగా అమిత్ షాతో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ అటకెక్కడంతో బీజేపీ నాయకులు నిరాశచెందారు.

శుక్రవారం బెంగళూరు నగర శివార్లలోని దేవనహళ్లిలో కేంద్ర మంత్రి అమిత్ షాతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేశారు. మద్యాహ్నం నుంచి అమిత్ షా దేవనహళ్లిలోని శివగణేష్ సర్కిల్ నుంచి చెన్నరాయపట్టణ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
దేవనహళ్లితో పాటు బెంగళూరు, బెంగళూరు గ్రామీణ జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్తలు వేలాది మంది దేవనహళ్లి చేరుకున్నారు. అయితే దేవనహళ్లి భారీ వర్షం కురవడంతో బీజేపీ నాయకులు బిత్తరపోయారు. వర్షం తగ్గిన తరువాత అమిత్ షా ర్యాలీ కొనసాగించాలని బీజేపీ నాయకులు ఎదురు చూశారు.
దేవనహళ్లి బీజేపీ అభ్యర్థి పిళ్ల మునిశామప్ప తరపున అమిత్ షా ప్రచారం చెయ్యాల్సి ఉంది. అయితే భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో అమిత్ షా రోడ్ షో, బహిరంగ సభ రద్దు అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా అమిత్ షా మొదటి రోడ్ షో , ర్యాలీ రద్దు కావడంతో అది అపశకునం అంటూ బీజేపీ కార్యకర్తలు అప్పుడే గుసగుసలాడుతున్నారు.












Click it and Unblock the Notifications