బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

CM Seat: ఊపిరిపీల్చుకున్న సీఎం, కుర్చీ సేఫ్, ఆ రోజు మీటింగ్ రద్దు, స్టార్ హోటల్ లో విందుకు ఓకే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పను సీఎం కుర్చి నుంచి దించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన వర్గీయులకు శుభవార్త వచ్చింది. యడియూరప్పతో ఏర్పాటు చేసిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశం రద్దు కావడంతో ఆయన వర్గీయులు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు రద్దు చేసిన బీజేపీ హైకమాండ్ అంతకు ముందు రోజు మంత్రులు, ఎమ్మెల్యేలకు స్టార్ హోటల్ లో విందు భోజనం ఏర్పాటు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చుతారు ? అని ప్రచారం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సమావేశానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.

Illegal affair: ఇంట్లో మొగుడు, పక్కింట్లో ప్రియుడు, రెండు చేతులతో మర్మాంగం? బెడ్ రూమ్!Illegal affair: ఇంట్లో మొగుడు, పక్కింట్లో ప్రియుడు, రెండు చేతులతో మర్మాంగం? బెడ్ రూమ్!

సీఎం ఢిల్లీ టూర్ తో ?

సీఎం ఢిల్లీ టూర్ తో ?

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులను పక్కనపెట్టి ఇటీవల ఆయన కుమారుడు బీవై. విజయేంద్రను వెంటపెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా, కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప భేటీ అయ్యారు.

 సీఎంను చైంజ్ చేస్తారని ?

సీఎంను చైంజ్ చేస్తారని ?


కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పను తప్పించి సీఎం కుర్చీ వేరే నాయకుడికి అప్పగిస్తారని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలోనే యడియూరప్ప ఢిల్లీ టూర్ కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి ఆయన సన్నిహిత మంత్రులు, ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశం అయ్యారు.

 పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్

పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్

ఢిల్లీ నుంచి బెంగళూరు వచ్చిన వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి ఈనెల 26వ తేదీన పార్టీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. తన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి జూలై 26వ తేదీకి రెండు సంవత్సరాలు పూర్తి అవుతుందని, అందుకే ఆ రోజు ఎమ్మెల్యేతో సమావేశం అయ్యి ప్రభుత్వం చేపట్టవలసిన అభివృద్ది పనుల విషయం గురించి అందరితో చర్చిస్తామని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు.

 ఎమ్మెల్యేలతో సమావేశం రద్దు

ఎమ్మెల్యేలతో సమావేశం రద్దు

జులై 26వ తేదీన సీఎం బీఎస్. యడియూరప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం తాత్కాలికంగా రద్దు అయ్యింది. ఈనెల 26వ తేదీన ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం రద్దు కావడంతో ఓ వర్గం సంతోషంగా ఉంటే మరో వర్గంలోని నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

Recommended Video

Karnataka Politics Audio Clip Leaked In Karnataka Increase Heat Over CM Yediyurappa Resign Issue
 స్టార్ హోటల్ లో విందుకు గ్నీన్ సిగ్నల్

స్టార్ హోటల్ లో విందుకు గ్నీన్ సిగ్నల్


ఈనెల 26వ తేదీ సోమవారం బీజేపీ ఎమ్మెల్యేల శాసనసభా సమావేశం రద్దు అయినా అంతుకు ముందు రోజు జులై 25వ తేదీ ఆదివారం రాత్రి 7. 30 గంటలకు విందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్ లో మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విందు భోజనం ఏర్పాటు చెయ్యడానికి సీఎం బీఎస్. యడియూరప్ప సిద్దం అయ్యారు. ఆదివారం రాత్రి ఏం చర్చలు జరుగుతాయో ? అని విషయంలో క్లారిటీ వచ్చిన తరువాత సీఎం బీఎస్. యడియూరప్ప బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తారని తెలిసింది.

English summary
CM Seat: In a latest development BJP legislative party meeting on July 26 called by Karnataka chief minister B. S. Yediyurappa cancelled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X