బెంగళూరులో ‘పేసీఎం’ పోస్టర్ల కలకలం: సీఎం లక్ష్యంగా కాంగ్రెస్, తొలగింపు

బెంగళూరు:కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ వినూత్న రీతిలో విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రముఖ డిజిటల్​ చెల్లింపుల సంస్థ పేటీఎం తరహాలో PayCM అంటూ పోస్టర్లు బుధవారం బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో అంటించింది.

ఆ పోస్టర్లు ఎలక్ట్రానిక్ వాలెట్ Paytm ప్రకటనల మాదిరిగానే ఉన్నాయి. QR కోడ్ మధ్యలో "40 % ఇక్కడ అంగీకరించబడింది' అనే సందేశంతో బసవరాజ్ బొమ్మై ముఖ చిత్రం ఉంచారు.

Congress targets CM Bommai: PayCM Posters In Bengaluru Over Corruption.

ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన కాంగ్రెస్.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దూకుడుగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. బొమ్మై ప్రభుత్వం 40 శాతం కమీషన్లు తీసుకుంటుందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా, పోస్టర్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చిన వెంటనే బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ఈ పోస్టర్లను తొలగించారు.

పేసీఎం పోస్టర్ల వ్యవహారంపై పోలీసు శాఖ స్పందించింది. వాటిని అంటించినందుకు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు.

మరోవైపు, ఈ పోస్టర్లను అంటించిన వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించారు ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై. అంతేగాక, పోస్టర్లు అంటించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+