Coronavirus: ఐటీ హబ్ లో ఒకటిన్నర నెల తరువాత, లాక్ డౌన్ ఎఫెక్ట్, పర్వాలేదు, కానీ !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు సిటీలో ఒకటిన్నర నెల రోజుల తరువాత కోవిడ్ మరణాల సంఖ్య తక్కువగా నమోదు కావడంతో ప్రభుత్వంతో పాటు ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. గత 50 రోజుల నుంచి బెంగళూరు నగరంలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు కరోనా వైరస్ చికిత్స విఫలమై వందలాది మంది మరణించడతో ప్రజలు హడలిపోయారు. ఇన్ని రోజుల తరువాత ఐటీ హబ్ లో కరోనా మరణాల సంఖ్య తక్కువగా నమోదు కావడంతో ప్రజలు హమ్మయ్యా అంటూ కొంచెం ఊపిరిపీల్చుకుంటున్నారు.

బెంగళూరులో ఎంతమంది అంటే ?
గత 24 గంటల్లో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ చికిత్స విఫలమై 179 మంది ప్రాణాలు పోయాయి. అందులో బెంగళూరు సిటీలో మాత్రం 44 మంది మరణించారు. గత ఒకటిన్నర నెల తరువాత బెంగళూరులో అతి తక్కువ సంఖ్యలో కరోనా వైరస్ మరణాలు నమోదు అయ్యాయని కర్ణాటక ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ త్రిలోక్ చంద్రా అన్నారు.

బెంగళూరుతో పాటు ఈ జిల్లాల్లో !
కర్ణాటకలోని దారవాడ, కోప్పళ, మైసూరు జిల్లాతో పాటు బెంగళూరులో ఎక్కువ సంఖ్యలో కరోనా వైరస్ మరణాలు నమోదు అయ్యాయని డాక్టర్ త్రిలోక్ చంద్రా అంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ కేసులు, ఆ వ్యాధితో మరణించిన వారి వివరాలు సకాలంలో ఇవ్వడంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం నిర్లక్షం చేస్తోందని డాక్టర త్రిలోక్ చంద్రా విచారం వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేటు ఆసుపత్రల్లోనే ఎక్కువ మరణాలు
ప్రభుత్వ లెక్కల ప్రకారం కరోనా వైరస్ వ్యాధితో బెంగళూరులో 3, 916 మంది మరణిస్తే అందులో 2, 478 మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో మరణించారని అధికారులు అంటున్నారు. అయితే ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం కోవిడ్ మరణాల లెక్కలు సక్రమంగా చూపించడం లేదని, గత ఏడాది కూడా ఇలాంటి సమస్య ఎదరైయ్యిందని డాక్టర్ త్రిలోక్ చంద్రా అంటున్నారు.

బెంగళూరులో భారీగా తగ్గిక కోవిడ్ మరణాల సంఖ్య
బెంగళూరు నగరంలో మే 5వ తేదీ నుంచి భారీ సంఖ్యలో కోవిడ్ మరణాలు నమోదు అయ్యాయి. బెంగళూరులో కోవిడ్ వ్యాధితో 320 మంది నుంచి 626 మంది రోజూ చనిపోయారని అధికారులు అంటున్నారు. మే నెలతో పోల్చుకుంటే ఇప్పుడు భారీ మొత్తంలో కోవిడ్ మరణాల సంఖ్య నమోదు అయ్యిందని బీబీఎంపీ కమీషనర్ గౌరవ్ గుప్తా ప్రముఖ ఆగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. మొత్తం మీద ఐటీ హబ్ బెంగళూరులో ఒకటిన్నర నెల తరువాత అతి తక్కువ సంఖ్యలో కరోనా మరణాలు నమోదు అయ్యాయని వెలుగు చూడటంతో ప్రజలు కొంచెం ఊపిరిపీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications