Coronavirus covid 19 CM govt officers bbmp collapse bengaluru people start కరోనా వైరస్ నమ్మకం కోవిడ్ 19 సీఎం ప్రభుత్వం అధికారులు బీబీఎంపీ బెంగళూరు ప్రజలు
Bengaluru: ఐటీ సిటీలో కరోనా గంగజాతర, మాస్క్ లేదు, మటన్ లేదు, 53%, 10 రోజుల్లో పండగ!
బెంగళూరు/ మంగళూరు: ఐటీ, బీటీ సంస్థల దేశరాజధాని బెంగళూరు సిటీలో కరోనా వైరస్ ( Covid-19) కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో కరోనా వైరస్ ను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారని స్వయంగా ఓ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వారంలో కర్ణాటకలో నమోదైన కరోనా కేసుల్లో బెంగళూరులోనే 53 శాతం కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. మంగళవారం ఒక్కరోజు కర్ణాటకలో 1,135 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో బెంగళూరులో మాత్రమే 710 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. బెంగళూరులోని 6 ప్రాంతాల్లోనే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో BBMP అధికారులు అలర్ట్ అయ్యారు.
Lady leader: ఎమ్మెల్యే టిక్కెట్, మీరు కాదు, నేను గుండు కొట్టుకుంటా, ఏం చేస్తారో చేసుకోండి !

10 రోజుల్లో కరోనా గంగజాతర
బెంగళూరు నగరంలో, బెంగళూరు గ్రామీణ ప్రాంతాల్లో గత వారంతో పోల్చుకుంటే ఈ వారం రోజుల్లో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని వెలుగు చూడటంతో ప్రజలు హడలిపోయారు. విషయం తెలుసుకున్న బీబీఎంపీ కమిషనర్ మంజునాథ్ బెంగళూరు పరిధిలోని 198 వార్డుల్లోని ఆరోగ్య శాఖ అధికారులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించి వివరాలు సేకరించారు.

అధికారుల నిర్లక్షం ?
బెంగళూరు నగరంలో కరోనా వైరస్ వ్యాధిని ప్రజలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు గుమికూడి కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణం అవుతున్నా ఆరోగ్య శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అందుకే బెంగళూరు సిటీలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయని ఓ అధికారి విచారం వ్యక్తం చేస్తున్నారని ఓ ఆంగ్ల పత్రిక వార్త ప్రచురించడం కలకలం రేపింది.

10 వార్డుల్లో పండగ
బెంగళూరులో మొత్తం 198 వార్డులు (BBMP) ఉన్నాయి. బెంగళూరులోని 10 వార్డుల్లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అధికారులు గుర్తించారు. బెంగళూరులో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అధిక శాతం కరోనా పాజిటివ్ కేసులు ఈ పది వార్డుల్లోనే ఉన్నాయని అధికారులు గుర్తించారు. బెంగళూరులో కరోనా పాజిటివ్ కేసులతో బెళ్ళందూరు వార్డు టాప్ 1 లో ఉండటంతో స్థానిక ప్రజలకు నిద్రపట్టడం లేదు.

బెంగళూరులో కరోనా పంజా ప్రాంతాలు
*. బెళ్ళందూరు వార్డు- 131 పాజిటివ్ కేసులు.
*. హగదూరు వార్డు- 71 పాజిటివ్ కేసులు.
*. బీటీఎం లేఔట్ వార్డు- 70 పాజిటివ్ కేసులు.
*. హొసకెరెహళ్ళి వార్డు- 50 పాజిటివ్ కేసులు.
*. కోణెనెకుంటే వార్డు- 57 పాజిటివ్ కేసులు.
*. జరగనహళ్ళి వార్డు- 49 పాజిటివ్ కేసులు.
*. శాంతలనగర్ వార్డు- 68 పాజిటివ్ కేసులు.
*. బాణసవాడి వార్డు- 55 పాజిటివ్ కేసులు.
*. గాంధీనగర్ వార్డు- 56 పాజిటివ్ కేసులు.
*. జ్ఞానభారతీ వార్డు- 53 పాజిటివ్ కేసులు నమోదైనాయి.

మాస్క్ లేదు..... చింతకాయ లేదు
ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రజలు కచ్చితంగా ముఖానికి మాస్క్ పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప పదేపదే మనవి చేస్తున్నారు. అయితే బయటకు వచ్చే ప్రజలు ఎక్కడ వాళ్ల అందమైన ముఖం బయటకు కనపడదో అనే ఫీలింగ్ తో మాస్క్ లు వేసుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా నిర్లక్షంగా సంచరించడం వలన కరోనా వైరస్ మరింత వ్యాపిస్తోందని కొందరు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డోంట్ కేర్ అంటున్న ప్రజలు
బెంగళూరులో రానురాను కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి కర్ణాటకలో అడుగుపెట్టే ప్రజలు కచ్చితంగా కోవిడ్ పరీక్షలు చేయించుకుని రావాలని కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయినా కర్ణాటకలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి.