బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: వారం రోజులు అంతే, సీఎం నిర్ణయంతో వ్యాపారులు షాక్, ఐటీ హబ్ లో పర్వాలేదు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (Covid-19) మహమ్మారి దెబ్బతో మరోసారి కర్ణాటకలో లాక్ డౌన్ పొడగించారు. ఐటీ హబ్ బెంగళూరు నగరంతో సహ పలు జిల్లాల్లో లాక్ డౌన్ పొడగింపు సందర్బంగా కొన్ని నియమాలు సడలించారు. కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తున్న 11 జిల్లాల్లో లాక్ డౌన్ లో ఎలాంటి మార్పులు లేవని, ప్రభుత్వం చూసించిన నియమాలు కచ్చితంగా పాటించాలని ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. జూన్ 21 తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చెయ్యడంతో కొందరు వ్యాపారులకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో షాక్ కు గురైనారు.

Mrs India Winner: వ్యాపారవేత్తతో అక్రమ సంబంధం, మాజీ మిసెస్ రూ. కోట్లు డీల్, ఆ వీడియోతో !Mrs India Winner: వ్యాపారవేత్తతో అక్రమ సంబంధం, మాజీ మిసెస్ రూ. కోట్లు డీల్, ఆ వీడియోతో !

 లాక్ డౌన్ విషయంలో ఏం చేద్దాము ?

లాక్ డౌన్ విషయంలో ఏం చేద్దాము ?

బెంగళూరులోని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అధికార నివాసంలో కర్ణాటక మంత్రులు, ఆరోగ్య శాఖ అధికారులు. పలువిభాగాల అధికారులు, నిపుణులతో చర్చించారు. కర్ణాటకలో లాక్ డౌన్ గడుపు పొడగించాలా ?, అన్ లాక్ ప్రకటించాలా ? అంటూ సీఎం బీఎస్ యడియూప్ప అందరి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.

ఆ జిల్లాల్లో లాక్ డౌన్ ఉంటేనే అందరికి మేలు

ఆ జిల్లాల్లో లాక్ డౌన్ ఉంటేనే అందరికి మేలు

కర్ణాటకలోని 11 జిల్లాల్లో కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తోందని, లాక్ డౌన్ అమలులో ఉన్నా ఆ జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్డడం లేదని పలువురు మంత్రులు, అధికారులు సీఎం బీఎస్. యడియూరప్పకు చెప్పారు. కర్ణాటకలోని 11 జిల్లాలో యధావిదిగా లాక్ డౌన్ కొనసాగించాలని ఆ జిల్లాల ఇన్ చార్జ్ మంత్రులు, కలెక్టర్లు, అధికారులు సీఎం బీఎస్. యడియూరప్పకు మనవి చేశారు.

 ఆ జిల్లాలతో జాగ్రత్త

ఆ జిల్లాలతో జాగ్రత్త

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు గ్రామీణ జిల్లా, మైసూరు, బెళగావి, శివమొగ్గ, దావణగెరె, చిక్కమగళూరు, చామరాజనగర, హాసన్, దక్షిణ కన్నడ జిల్లా, మండ్య, కొడుగు జిల్లాలో ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ యాధివిదిగా కొనసాగుతుందని సీఎం బీఎస్. యడియూరప్ప క్లారిటీ ఇచ్చారు. మిగిలిన జిల్లాల్లో (బెంగళూరు సిటీతో సహ) ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నాం 2 గంటల వరకు లాక్ డౌన్ నియమాలు సడలిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అన్నారు.

 కర్ణాటక మొత్తం నైట్ కర్ఫ్యూ

కర్ణాటక మొత్తం నైట్ కర్ఫ్యూ

బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో 11 జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో లాక్ డౌన్ నియమాల్లో మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు అధికారులు సూచించిన వ్యాపారాలు చేసుకోవచ్చని, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప స్పష్టం చేశారు.

 వీకెండ్ లో డే అండ్ నైట్ కర్ఫ్యూ

వీకెండ్ లో డే అండ్ నైట్ కర్ఫ్యూ


కర్ణాటక వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం వేకువ జామున 5 గంటల వరకు డై అండ్ నైట్ కర్ణ్యూ అమలు చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప చెప్పారు. జూన్ 21వ తేదీ వరకు కర్ణాటకలో లాక్ డౌన్ అమలులో ఉంటుందని, కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి ప్రజలు అందరూ సహకరించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూర్ప ప్రజలకు మనవి చేశారు.

English summary
Coronavirus: Karnataka CM B.S. Yediyurappa has taken a decision. The lockdown will continue until the 21st of June.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X