సీఎం ఆఫీస్ పక్కనే నాకు ఆఫీస్ కావాలి. ఏం చేస్తారో నాకు తెలీదు, లింక్ పెట్టిన డీకే!

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ అనివార్య కారణాల వలన డీసీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే. శివకుమార్‌లు పోటీ పడ్డారు. చివరకు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తూ కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ రాజీ చేస్తూ ఇద్దరు నాయకులను ఒప్పించింది.

సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య అంతా సవ్యంగానే కనిపిస్తున్నప్పటికీ డీకే శివకుమార్ మాత్రం తనదైన చరిష్మాను ఉపయోగించుకోవడంలో బిజీగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క‌ర్ణాట‌క స‌ర్కారులో తాను కూడా సీఎం అంత ప‌వ‌ర్ ఫుల్ అని చూపించుకునే విధంగా డీకే శివకుమార్ ప్రవర్తిస్తున్నారని తెలిసింది. ఈ కారణంగానే డీకే శివకుమార్ కొన్ని డిమాండ్లు పెడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుసగుసలాడుతున్నారు.

DK Sivakumar is demanding an office next to CM Siddaramaiahs office in Vidhana Soudha

విశ్వసనీయ సమాచారం మేరకు విధానసౌధ మొదటి అంతస్తులో సీఎం సిద్ధరామయ్య కార్యాలయం ఉంది. సీఎం ఆఫీసు పక్కనే తనకు ఓ కార్యాలయం ఇవ్వాలని డీకే శివకుమాస్ ఆయన సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. ఈ కార్యాలయాలు అసెంబ్లీ హాలు పక్కనే ఉన్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధ పశ్చిమ ద్వారం నుంచి లోపలికి ప్రవేశిస్తే కుడివైపున ఆయన గది ఉంది. ఈ గదిని సీఎం సెషన్‌లో ఉపయోగిస్తున్నారు.

ఇప్పుడు డీసీఎం డీకే శివకుమార్ విధానసౌధ సిబ్బందికి తనకు సీఎం సిద్దరామయ్య ఆఫీసు పక్కనే కార్యాలయం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తనకు సీఎం కార్యాలయం పక్కనే గది కేటాయించాలని డీకే శివకుమార్‌ సంబంధిత అధికారులకు చెప్పడంతో ఇప్పుడు అధికారులు అయోమయంలో పడ్డారని తెలిసింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య గది ప్రస్తుతం పశ్చిమ ద్వారం కుడివైపు మొదటి అంతస్తులో ఉంది. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి ఎడమవైపు గది కోసం చూస్తున్నారు.

DK Sivakumar is demanding an office next to CM Siddaramaiahs office in Vidhana Soudha

గతంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రులెవరికీ విధానసౌధ మొదటి అంతస్తులో ప్రత్యేక గది లేకపోవడం గమనార్హం. నివేదికల ప్రకారం ముఖ్యమంత్రి కార్యాలయం పక్కనే ఒక గది ఖాళీగా ఉంది. ప్రస్తుత బడ్జెట్ సెషన్ లోనే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఆగది కేటాయించే అవకాశం ఉందని సమాచారం.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం తన 14వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు హామీల కోసం దాదాపు రూ. 52 వేల కోట్లు కేటాయించారు. అన్నభాగ్య, గృహలక్ష్మి, గృహజ్యోతి, యువనిధి, శక్తి పథకాలపై ముఖ్యమంత్రి ఎక్కువ దృష్టి పెట్టారు. డీకే శివకుమార్ ఉపముఖ్యమంత్రి పదవితో పాటు జలవనరులు, బెంగళూరు అభివృద్ధి శాఖల బాధ్యతలు చేపట్టారు. బ్రాండ్ బెంగళూరు కలను సాకారం చేసేందుకు కృషి చేస్తానని డీకే శివకుమార్ ఇప్పటికే ప్రజలకు హామీ ఇచ్చారు. బెంగళూరుకు సింహభాగం గ్రాంట్ ఇస్తానని సీఎం సిద్ధరామయ్య బడ్జెట్ లో ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+