College girl: తెలంగాణ యువకుడు, చింతామణి కాలేజ్ అమ్మాయి, వీడియో కాల్స్, డెత్ నోట్ కలకలం!

బెంగళూరు/ హైదరాబాద్/ చింతామణి: ప్రముఖ కాలేజ్ లో యువతి బీఎస్పీ చివరి సంవత్సరం చదువుతోంది. కాలేజ్ హాస్టల్ లో ఉంటున్న ఆమె స్నేహితులతో కలిసి ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లివస్తోంది. కాలేజ్ లో చదువుతున్న యువతికి సోషల్ మీడియాలో తెలంగాణకు చెందిన యువకుడితో పరిచయం అయ్యింది. రానురాను కాలేజ్ అమ్మాయి, తెలంగాణ యువకుడు వీడియో కాల్ లో గంటలు గంటలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఇదే సమయంలో ఇద్దరి మద్య ఓ విషయంలో తేడాలు వచ్చాయి. ఒకరిని ఒకరు నేరుగా కలుసుకుని మాట్లాడుకోకముందే తన రూమ్ కు రావాలని యువకుడు కాలేజ్ అమ్మాయి మీద ఒత్తిడి చేశాడని తెలిసింది. రాత్రి యువతి, యువకుడు చాలాసేపు వీడియో కాల్ లో మాట్లాడుకున్నారు. తరువాత కాలేజ్ అమ్మాయి రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాలేజ్ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన డోత్ వివరాలు బయటకు రావడం కలకలం రేపింది.

చదువులో ఫస్ట్

చదువులో ఫస్ట్

కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి (మదనపల్లె సరిహద్దు) సమీపంలోని కురుబూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పవితా (21) అనే యువతి బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతోంది. పదో తరగతి, ఇంటర్ లో ఎక్కువ మార్కులు సాధించిన పవిత్రా బీఎస్సీ రెండు సంవత్సరాల పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది.

సోషల్ మీడియాలో బాయ్ ఫ్రెండ్

సోషల్ మీడియాలో బాయ్ ఫ్రెండ్

కాలేజ్ హాస్టల్ లో ఉంటున్న పవిత్రా ఆమె స్నేహితులతో కలిసి ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లివస్తోంది. కాలేజ్ లో చదువుతున్న పవిత్రాకు సోషల్ మీడియాలో తెలంగాణకు చెందిన ఓ యువకుడితో పరిచయం అయ్యింది. కొంతకాలం తెలంగాణ యువకుడు. పవిత్రా సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకుంటూ దగ్గర అయ్యారు.

ప్రతిరోజు వీడియో కాల్స్

ప్రతిరోజు వీడియో కాల్స్

రానురాను కాలేజ్ అమ్మాయి పవిత్రా, తెలంగాణ యువకుడు వీడియో కాల్ లో గంటలు గంటలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పవిత్రా ఓ యువకుడితో వీడియో కాల్స్ లో మాట్లాడుతున్న విషయం ఆమె స్నేహితులకు తెలుసని సమాచారం. ఇదే సమయంలో పవిత్రా, తెలంగాణ యువకుడి మద్య ఓ విషయంలో తేడాలు వచ్చాయి.

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పవిత్రా

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పవిత్రా

కాలేజ్ హాస్టల్ లో పవిత్రాతో పాటు ఆమె స్నేహితులు ఉంటున్నారు. పరీక్షలు జరుగుతున్న సందర్బంగా స్నేహితులు వేరే రూమ్ లో చదువుకోవడానికి వెళ్లారు. ఆ సందర్బంలో పవిత్రా, తెలంగాణ యువకుడు వీడియో కాల్ లో మాట్లాడుకున్నారు. తరువాత ఇద్దరి మద్య గొడవ జరిగిందని తెలిసింది. తరువాత పవిత్రా కాలేజ్ హాస్టల్ రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

పవిత్రా డెత్ నోట్ కలకలం

పవిత్రా డెత్ నోట్ కలకలం

ఒకరిని ఒకరు నేరుగా కలుసుకుని మాట్లాడుకోకముందే తన రూమ్ కు రావాలని తెలంగాణ యువకుడు కాలేజ్ అమ్మాయి పవిత్రా మీద ఒత్తిడి చేశాడని తెలిసింది. తన ప్రేమిస్తున్న యువకుడు మంచివాడు కాదని కొంతకాలం దూరం పెట్టానని, తరువాత అతను మళ్లీ ఫోన్లు చేసి దగ్గర అయ్యాడని కాలేజ్ అమ్మాయి పవిత్రా ఆమె స్నేహితులకు చెప్పింది. తెలంగాణ యువకుడి విషయం ఆమె అక్కకు తెలిసిపోయిందని, ఆమె పవిత్రాకు ఫోన్ చేసి మావాడికి దూరంగా ఉండాలని హెచ్చరించిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

కేసు పెట్టిన పవిత్రా కుటుంబ సభ్యులు

కేసు పెట్టిన పవిత్రా కుటుంబ సభ్యులు

మా అమ్మాయి ఆత్మహత్యకు తెలంగాణ యువకుడు కారణం అని అతని ఫోన్ నెంబర్ తో సహా పోలీసులకు ఇచ్చిన పవిత్రా కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. చింతామణి గ్రామీణ పోలీసులు పవిత్రా హాస్టల్ లో రూమ్ పరిశీలించి ఆమె వస్తులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+