బెంగళూరులో దుమ్ములేపిన వాన దేవుడు, నెత్తిన జెండాలు పెట్టుకుని పరుగో పరుగు!
బెంగళూరు/మైసూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సవ్వంగా జరగాలని అన్ని పార్టీల నాయకులు అనుకుంటున్నారు. అయితే సోమవారం మద్యాహ్నం నుంచి బెంగళూరు నగరంతో సహ వివిద జిల్లాల్లో వాన దంచికొట్టింది. బెంగళూరులో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులో వాన దేవుడు ప్రతాపం చూపించడంతో వీది వ్యాపారులు, వాహన చోదకులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సోమవారం సాయంత్రం 6 గంటలకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అయితే సోమవారం మద్యాహ్నం వాన దేవుడు ఎన్నికల ప్రచారం చేస్తున్న వారికి చుక్కలు చూపించి ఇళ్లలోకి పంపించేశారు. పలు ప్రాంతాల్లో ర్యాలీగా వెలుతున్న వివిద పార్టీల నాయకులు వాన దెబ్బకు చుట్టుపక్కల ఉన్న భవనాలు, ఇండ్లల్లోని బాల్కనీల కింద తలదాచుకున్నారు.

బెంగళూరులోని పలు నియోజక వర్గాల పరిధిలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన నాయకులు ఓటర్ల పేర్లు చీటీల్లో రాసి ఏ బూతులో ఓటు వెయ్యాలో అని చెప్పడానికి చీటిలు చేతిలో పట్టుకుని ఇంటింటికి తిరుగుతున్న సమయంలో వాన మొదలైయ్యింది. బెంగళూరులో బహిరంగ ప్రచారానికి వాన దేవుడు కొన్ని గంటలు బ్రేక్ వేశాడు.
బెంగళూరులోని చిక్కపేట, కేఆర్ మార్కెట్, కలాసిపాళ్య, టౌన్ హాల్. జయనగర్, బోమ్మనహళ్లి ప్రాంతాల్లో భారీ ఉరుములు, మెరుపులతో గంటకు పైగా భారీ వర్షం కురిసింది. వచ్చే 24 గంటల్లో బెంగళూరు దక్షిణ, రాజరాజేశ్వరి నగర్, బోమ్మనహళ్లి బీబీఎంపీ విభాగాల పరిధిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సోమవారం వాతవరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
రాజాజీనగర్, మహాలక్ష్మి లేఔట్, విజయనగర, శివనగర, దాసరహళ్లి, మల్లేశ్వరం ప్రాంతాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న నాయకులు బిక్కముఖం వేస్తున్నారు.
బెంగళూరు సిటీతో పాటు బెంగళూరు గ్రామీణ, తుమకూరు, మైసూరు, చామరాజనగర, రామనగర, చెన్నపట్టణ, కోలారు. చిక్కబళ్లాపుర జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ అధికారులు ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications