బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hijab Row: బుర్కాల వివాదం, సీన్ లోకి వచ్చిన హైదరాబాద్ యూత్, అది మా హక్కు, సల్మాన్ ఖాన్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హైదరాబాద్/ఉడిపి: కాలేజ్ లు, స్కూల్స్ లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలు ధరించే హిజాబ్ (బుర్కాలు) ల వివాదం చిలికి చిలికి గానవానలా మారిపోయి తుపానులా మారుతోంది. విద్యాసంస్థల్లో ముస్లీం అమ్మాయిలు బుర్కాలు వేసుకుని వస్తే మేము కూడా కాషాయం కండువాలు వేసుకుని నుదిటి మీద సింధూరం పెట్టుకుని కాలేజ్ లోకి వస్తామని హిందులు పట్టుబడుతున్నారు. ఈ వివాదానికి పరిష్కారం చూపించి ఇంతటితో చెక్ పెట్టకపోతే విద్యాసంస్థల్లో చదువుతున్న మా రైతు బిడ్డలు పచ్చరంగు కండువాలు వేసుకుని వస్తారని మాజీ సీఎం అంటున్నారు.

ఇప్పుడు ఉడిపి జిల్లాలో మొదలైన హిజాబ్ వివాదం కర్ణాటక వ్యాప్తంగా వ్యాపించింది. ఈ రోజు మంగళవారం కర్ణాటక హైకోర్టులో దాఖలు అయిన హిజాబ్ వివాదం అర్జీ పిటీషన్ విచారణ జరగనుంది. ఇదే సమయంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ముస్లీం సంఘం నాయకులు ఉడిపి చేరుకుని హిజాబ్ ధరించాలని పోరాటం చేస్తున్న అమ్మాయిలకు మద్దతు ఇచ్చారు.

2014 నుంచి దేశంలో మైనారీల మీద దౌర్జన్యం జరుగుతోందని, మా హక్కులను కాలరాస్తున్నారని, హైకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్నామని, అవసరమైన సుప్రీం కోర్టు వరకు వెలుతామని హైదరాబాద్ కు చెందిన యూత్ కరేజ్ సంస్థ నాయకుడు సల్మాన్ ఖాన్ అంటున్నాడు. ఉడిపి చేరుకున్న సల్మాన్ ఖాన్ హిజాబ్ కోసం పోరాటం చేస్తున్న కాలేజ్ అమ్మాయిలకు పూర్తి మద్దతు ఇచ్చారు.

Illegal affair: ప్రియురాలి కోసం ఆమె ఫ్యాన్స్ వస్తున్నారని ?, వీధిలో ప్రియుడు ఏం చేశాడంటే!Illegal affair: ప్రియురాలి కోసం ఆమె ఫ్యాన్స్ వస్తున్నారని ?, వీధిలో ప్రియుడు ఏం చేశాడంటే!

ఉడిపిలో మొదలై కర్ణాటక మొత్తం రచ్చరచ్చ

ఉడిపిలో మొదలై కర్ణాటక మొత్తం రచ్చరచ్చ

విద్యాసంస్థల్లో ముస్లీం అమ్మాయిలు బుర్కాలు వేసుకుని వస్తే మేము కూడా కాషాయం కండువాలు వేసుకుని నుదిటి మీద సింధూరం పెట్టుకుని కాలేజ్ లోకి వస్తామని హిందులు పట్టుబడుతున్నారు. ఇప్పుడు ఉడిపి జిల్లాలో మొదలైన హిజాబ్ వివాదం కర్ణాటక వ్యాప్తంగా వ్యాపించింది. విద్యాసంస్థల ఆవరణంలో హిజాబ్ ధరించి రాకూడదని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

హిజాబ్ కు అప్పుడు లేని నియమాలు ఇప్పుడు ఎందుకు?

మరో వైపు విద్యార్థులు హిజాబ్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాలేజ్ ల్లోకి ఇన్ని సంవత్సరాలు హిజాబ్ ధరించి వచ్చి చదువుకున్నామని, అప్పుడు లేని నియమాలు ఇప్పుడు ఎందుకు అంటూ ముస్లీం అమ్మాయిలు కాలేజ్ ప్రిన్సిపాల్, అధ్యాపకులను నిలదీస్తున్నారు.

మాజీ సీఎం ఎంట్రీ

మాజీ సీఎం ఎంట్రీ

హిజాబ్ వేసుకున్నా, కాషాయం కండువాలు వేసుకుని వెళ్లి చదువుకుంటే వెంటనే ఈ సమాజం బాగుపడదని, ఈ వివాదానికి పరిష్కారం చూపించి ఇంతటితో చెక్ పెట్టకపోతే విద్యాసంస్థల్లో చదువుతున్న మా రైతు బిడ్డలు పచ్చరంగు కండువాలు వేసుకుని రావాలని పిలుపునిస్తామని కర్ణాటక మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి అంటున్నారు.

హైదాబాద్ నుంచి వచ్చిన లీడర్స్

హైదాబాద్ నుంచి వచ్చిన లీడర్స్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ముస్లీం సంఘం నాయకులు ఉడిపి చేరుకుని హిజాబ్ ధరించాలని పోరాటం చేస్తున్న అమ్మాయిలకు మద్దతు ఇచ్చారు. 2014 నుంచి భారతదేశంలో మైనారీల మీద దౌర్జన్యం జరుగుతోందని, మా హక్కులను కాలరాస్తున్నారని హైదరాబాద్ కు చెందిన యూత్ కరేజ్ సంస్థ నాయకుడు సల్మాన్ ఖాన్ అంటున్నారు.

సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము

సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము

ఉడిపిలో యూత్ కరేజ్ సంస్థ నాయకుడు సల్మాన్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. హిజాబ్ (బుర్కాలు) వేసుకోకుండా మీరు ఆపలేరని, అలా చేస్తా మా మతం సంప్రధాయాలు కించపరిచినట్లు అవుతుందని సల్మాన్ ఖాన్ ఆరోపించారు. హైకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్నామని, అవసరమైన సుప్రీం కోర్టు వరకు వెలుతామని హైదరాబాద్ కు చెందిన యూత్ కరేజ్ సంస్థ నాయకుడు సల్మాన్ ఖాన్ అంటున్నాడు.

కాలేజ్ అమ్మాయిలు గ్రేట్

కాలేజ్ అమ్మాయిలు గ్రేట్

హిజాబ్ వేసుకుని కాలేజ్ లకు వస్తామని పోరాటం చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన కాలేజ్ విద్యార్థినిలతో సల్మాన్ ఖాన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు హిజాబ్ ధరించాలని పోరాటం చేస్తున్న కాలేజ్ అమ్మాయిలకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని సల్మాన్ ఖాన్ మీడియాకు చెప్పారు.

పంజాబ్ లో ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా?

పంజాబ్ లో ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా?

పంజాబ్ లో సర్దార్ పగడి వేసుకుంటున్నారు, హిందువులు తిలకం పెట్టుకుంటున్నారు, క్రైస్తవులు వారి మత ఆచారాలు పాటిస్తున్నారని, అలాగే ముస్లీం అమ్మాయిలు ఇస్లాం మతాన్ని గౌరవించి హిజాబ్ లో ధరిస్తున్నారని, అక్కడ లేని నియమాలు ఇక్కడ ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని యూత్ కరేజ్ సంస్థ నాయకుడు సల్మాన్ ఖాన్ కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

English summary
Hijab Row: Hyderabad organization come to support students who protesting for allow hijab at Udupi district Kundapur college.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X