బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hijab Row: హిజాబ్ vs కాషాయం, రంగంలోకి సాయుధబలగాలు, విద్యాసంస్థలు ఓపెన్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ ఉడిపి: హిజాబ్ ధరించాలని కొందరు, కాషాయం కండువాలు ధరిస్తామని కొందరు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించి ఆందోళనలకు దిగడంతో ప్రజలు హడలిపోతున్నారు. కాలేజ్ విద్యార్థుల్లో ఇలాంటి తేడాలు రావడంతో చాలా మంది కుటుంబ సభ్యులు వాళ్ల పిల్లలను విద్యాసంస్థలకు పంపించడానికి వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. విద్యాసంస్థలు ప్రారంభం అయితే ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో అంటూ కొందరు విద్యార్థుల కుటుంబ సభ్యులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపడానికి పోలీసులు, సాయుధ బలగాలు రంగంలోకి దిగాయి. హిజాబ్ గొడవలు మొదలైన ఉపిడి జిల్లాతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు, సాయుధ బలగాలు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. మీరు ధైర్యంగా ఉండాలి అంటూ సామాన్య ప్రజలకు పోలీసులు ధైర్యం చెబుతున్నారు. హైకోర్టులో పిటిషన్ల విచారణ పూర్తి అయ్యే వరకు విద్యార్థులు ఎవ్వరూ కూడా హిజాబ్ లు ధరించి విద్యాసంస్థలకు రాకూడదని, కాషాయం కండువాలు వేసుకుని విద్యాసంస్థలకు వెళ్లకూడాదని ఇప్పటికే కర్ణాటక హైకోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసింది.

Illegal affair: భర్తతో సెకండో షో, ప్రియుడితో మార్నింగ్ షో, సైలెంట్ గా స్పాట్ పెట్టేశాడు !Illegal affair: భర్తతో సెకండో షో, ప్రియుడితో మార్నింగ్ షో, సైలెంట్ గా స్పాట్ పెట్టేశాడు !

హిజాబ్ తెచ్చిన తంటాలు

హిజాబ్ తెచ్చిన తంటాలు

కర్ణాటకలోని ఉడిపిలోని ప్రభుత్వ కాలేజ్ లో కొందరు అమ్మాయిలు హిజాబ్ లు ధరించి క్లాసులకు హాజరు అవుతామని పట్టుబట్టడం, కుదరదని కాలేజ్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు తేల్చి చెప్పడంతో అక్కడ గొడవలు మొదలైనాయి. ఉడిపిలో మొదలైన హిజాబ్ వివాదం తరువాత ఆ జిల్లాతో పాటు కర్ణాటక మొత్తం వ్యాపించింది.

పోటాపోటీగా నినాదాలు..... లాఠీచార్జ్

పోటాపోటీగా నినాదాలు..... లాఠీచార్జ్

హిజాబ్ లో ధరించి కాలేజ్ కు వెలుతామని కొందరు, కాషాయ కండువాలు వేసుకుని క్లాసుల్లో కుర్చుకుంటామని కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పోటాపోటీ ర్యాలీలు జరిగడంతో రాళ్ల దాడులు జరిగాయి. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ లు కూడా చేశారు.

అయోమయంలో తల్లిదండ్రులు

అయోమయంలో తల్లిదండ్రులు


విద్యార్థులు మళ్లీ ర్యాలీలు నిర్వహించకుండా, పరిస్థితి చెయ్యిదాటి పోకుండా ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పరిస్థితులు అదుపులోకి రావడంతో మళ్లీ విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హిజాబ్ ధరించాలని కొందరు, కాషాయం కండువాలు ధరిస్తామని కొందరు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించి ఆందోళనలకు దిగడంతో ప్రజలు హడలిపోతున్నారు.
హిజాబ్ ధరించాలని కొందరు, కాషాయం కండువాలు ధరిస్తామని కొందరు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించి ఆందోళనలకు దిగడంతో ప్రజలు హడలిపోతున్నారు.

 రంగంలోకి దిగిన సాయుధ బలగాలు

రంగంలోకి దిగిన సాయుధ బలగాలు


విద్యాసంస్థలు ప్రారంభం అయితే ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో అంటూ కొందరు విద్యార్థుల కుటుంబ సభ్యులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపడానికి పోలీసులు, సాయుధ బలగాలు రంగంలోకి దిగాయి.

ప్రశాంతంగా ఉండండి

ప్రశాంతంగా ఉండండి

హిజాబ్ గొడవలు మొదలైన ఉపిడి జిల్లాతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు, సాయుధ బలగాలు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. మీరు ధైర్యంగా ఉండాలి అంటూ సామాన్య ప్రజలకు పోలీసులు ధైర్యం చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం పలు ప్రాంతాల్లో పోలీసులు, సాయుధ బలగాలు మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తున్నారు.

విద్యాసంస్థలు ఓపెన్

విద్యాసంస్థలు ఓపెన్

హైకోర్టులో పిటిషన్ల విచారణ పూర్తి అయ్యే వరకు విద్యార్థులు ఎవ్వరూ కూడా హిజాబ్ లు ధరించి విద్యాసంస్థలకు రాకూడదని, కాషాయం కండువాలు వేసుకుని విద్యాసంస్థలకు వెళ్లకూడాదని ఇప్పటికే కర్ణాటక హైకోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాసంస్థలు ప్రారంభించాలని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి సమయంలో విద్యార్థులు, వారి కుటుంబసభ్యుల్లో ధైర్యం నింపడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

English summary
Hijab Row: Security forces are holding a flag march in Udupi, the epicentre of pro and anti-hijab protests in the Karnataka state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X