ఐటీ హబ్ లో బ్యానర్లు వేస్తే ఎన్ని వేలు ఫైన్ తెలుసా ?, అర్దలక్ష హామ్ ఫట్ అంతే!

బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నది. ఐటీ హబ్ బెంగళూరు నగరంలో ఇక ముందు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని బీబీఎంపీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి బెంగళూరు నగరంలో కొత్త నియమాలు అమలులోకి వస్తాయని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్ బెంగళూరు నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చెయ్యడం నిషేధం అయిన ఇంతకు ముందే కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, కోర్టు ఆదేశాలు మేము పాటిస్తామని అన్నారు. బెంగళూరు నగరంలో ఎవ్వరు కూడా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చెయ్యకూడదని, అది డీకే శివకుమార్ అభిమానులు అయినా, ఎవరైనా సరై అందరికి నియమాలు వర్థిస్తాయని డీకే. శివకుమార్ అన్నారు.

If you set up flexi and banners in Bengaluru. DK Sivakumar has given clarity that he will be fined Rs 50 thousand

కోర్టు ఆదేశాలను తాము కచ్చితంగా పాటిస్తామని, ఇప్పటికే బెంగళూరు నగరంలో వివిద రాజకీయ పార్టీల నాయకులు, పలువురు వ్యక్తులు వేసిన ప్లెక్సీలు పూర్తిగా తొలగిస్తామని, ఈ విషయంపై ఇప్పటికే బీబీఎంపీ అధికారులతో చర్చలు జరిపామని, తరువాత కూడా ఎవరైనా నియమాలు ఉల్లంఘించి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీకే శివకుమార్ అన్నారు.

ఆగస్టు 15వ తేదీ నుంచి బెంగళూరు నగరంలో ఎవరైనా నియమాలు ఉల్లంఘించి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే రూ. 50, 000 వేలు జరిమానా విధిస్తామని, అది ఏపార్టీ నాయకులు అయినా సరే. వ్యక్తులు అయినా సరే ఈ నియమాలు వర్థిస్తాయని డీకే. శివకుమార్ అన్నారు. మొత్తం మీద బెంగళూరు నగరంలో ఇక ముందు ఎవరైనా ఫ్లెక్సీలు, బ్యానర్లు వేస్తే వారి జోబులకు రూ. 50 వేలు బొక్క పడే అవకాశం ఉందని బీబీఎంపీ అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+