Bomb: పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ స్కూల్ కు బాంబు బెదిరింపు, ఈమెయిల్ ఐడీకి ?, అసలు మ్యాటర్!
బెంగళూరు: పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ నాయకుడి కుటుంబ సభ్యులకు చెందిన పబ్లిక్ స్యూల్ కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. స్కూల్ లో 1, 5000 మందికి పైగా విద్యాభ్యాసం చేస్తున్నారు. ఉదయం స్కూల్ ప్రారంభం అయిన వెంటనే బాంబు బెదిరింపు రావడంతో హడలిపోయిన స్కూల్ యాజమాన్యం విద్యార్థులు అందరిని బయటకు పంపించేశారు.
కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ కుటుంబ సభ్యులకు బెంగళూరు సిటీలోని రాజరాజేశ్వరి నగర పోలీస్ స్టేషన్ లో హిల్ వ్యూ పబ్లిక్ స్కూల్ ఉంది. సోమవారం ఉదయం స్కూల్ పిల్లలు అందరూ స్కూల్ కు వెళ్లారు. ఈ స్కూల్ లో 1,500 మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు.

సోమవారం ఉదయం 9 గంటల సమయంలో స్కూల్ లోని సిబ్బంది ఈ మెయిల్ ఇడీకి బాంబు బెదిరింపు లేఖ వచ్చింది. హడలిపోయిన స్కూల్ సిబ్బంది, యాజమాన్యం రాజరాజేశ్వరినగర పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చి స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు అందరిని ఇళ్లకు పంపించేశారు.
విషయం తెలుసుకున్న బెంగళూరు పశ్చిమ విభాగం డీసీపీ లక్ష్మణ నింబరగి, పోలీసు అధికారులు, బాంబు నిర్వీర్యధళం సిబ్బంది, పోలీసు జాగిలాలతో సంఘటనా స్థలానికి చేరుకుని స్కూల్ ఆవరణం మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి బాంబు చిక్కకపోవడంతో పోలీసు అధికారులతో పాటు స్కూల్ లో ఉద్యోగాలు చేస్తున్న సిబ్బంది, విద్యార్థుల కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. బాంబు బెదిరింపు లేఖ ఏమెయిల్ ఐడీ నుంచి వచ్చింది అంటూ ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications