బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IT Hub: ఎమ్మెల్యే సతీష్ రెడ్డి లగ్జరీ కార్లు ఒకేసారి బూడిద, ఎందుకు చేశారో స్టోరీ చేసిన నిందితులు, ఆ చాన్స్ !

|
Google Oneindia TeluguNews

బెంగూరు: మా సమస్యలు పరిష్కరించాలని మనవి చెయ్యాలని ఓ యువకుడు సీనియర్ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి దగ్గరకు అనేకసార్లు వెళ్లాడు. ఎమ్మెల్యే సార్ బిజీగా ఉన్నారని, తరువాత కలవాలని ఆయన అనుచరులు ఆ యువకుడికి చెప్పి వెనక్కి పంపించారని సమాచారం. చాలాసార్లు ఎమ్మెల్యేతో భేటీ కావాలని ప్రయత్నాలు చేసినా ఆ యువకుడికి పదేపదే చుక్కెదురైయ్యింది. మా నియోజక వర్గం ఎమ్మెల్యేకి మాతో మాట్లాడటానికి టైమ్ లేదా అంటూ ఆ యువకుడు రగిలిపోయాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఒక్కసారి కూడా తనతో ఎమ్మెల్యే సతీష్ రెడ్డి మాట్లాడలేదని ఆ యువకుడు కక్ష పెంచుకున్నాడు అంతే స్నేహితులతో కలిసి ఓ బైక్ చోరీ చేశాడు. చోరీ చేసిన బైక్ లో అర్దరాత్రి ఇద్దరు స్నేహితులతో కలిసి ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వెళ్లాడు. ఎమ్మెల్యే ఇంటి కాంపౌండ్ ఆవరణంలో పార్క్ చేసిన విలాసవంతమైన, ఖరీదైన కార్ల మీద పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి ఎస్కేప్ కావడం కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి ఇంటి ఆవరణంలోని విలాసవంతమైన కార్లు కాలి బూడిద కావడం కలకలం రేపింది. ఐటీ హబ్ లో ఈ సంఘటన హాట్ టాపిక్ అయ్యింది. నిందితులను పట్టుకున్న పోలీసులకు ప్రభుత్వం రూ. 1 లక్ష బహుమానం ఇచ్చిందంటే కేసు ఎంత సీనియస్ అయ్యిందో అర్థం అవుతోంది.

Illegal affair: భర్తకు బూడిద, ప్రియుడికి పాండ్స్ పౌడర్, రెండు హత్యలు, ప్రియుడి ఏజ్, గేజ్ తెలిస్తే !Illegal affair: భర్తకు బూడిద, ప్రియుడికి పాండ్స్ పౌడర్, రెండు హత్యలు, ప్రియుడి ఏజ్, గేజ్ తెలిస్తే !

 ఐటీ హబ్ ఏరియా ఎమ్మెల్యే

ఐటీ హబ్ ఏరియా ఎమ్మెల్యే


బెంగళూరు సిటీలోని బోమ్మనహళ్ళి నియోజక వర్గం ఎమ్మెల్యే సతీష్ రెడ్డి ఆ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే. బోమ్మనహళ్ళి నియోజక వర్గంలో ఐటీ కంపెనీలతో పాటు వందల సంఖ్యలో గార్మెంట్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన వేలాది మంది ఇదే నియోజక వర్గంలో నివాసం ఉంటున్న ఉద్యోగాలు, కూలి పనులు చేసుకుంటున్నారు.

ఎమ్మెల్యే భేటీకి ప్రయత్నాలు

ఎమ్మెల్యే భేటీకి ప్రయత్నాలు

బోమ్మనహళ్ళి నియోజక వర్గంలోని గార్వేబావిపాళ్యలో సాగర్ (19), బేగూరులో శ్రీధరన్ (20), నవీన్ అలియాస్ కాళప్ప (22) అనే యువకులు నివాసం ఉంటున్నారు. ఈ ముగ్గురు స్నేహితులు. మా సమస్యలు పరిష్కరించాలని మనవి చెయ్యాలని సాగర్ అనే యువకుడు సీనియర్ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి దగ్గరకు అనేకసార్లు వెళ్లాడని తెలిసింది. ఎమ్మెల్యే సతీష్ రెడ్డి సార్ బిజీగా ఉన్నారని, తరువాత కలవాలని ఆయన అనుచరులు సాగర్ కు చెప్పి వెనక్కి పంపించారని సమాచారం.

 ఎమ్మెల్యే మీద కక్ష పెంచుకున్నాడు

ఎమ్మెల్యే మీద కక్ష పెంచుకున్నాడు

చాలాసార్లు బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డితో భేటీ కావాలని ప్రయత్నాలు చేసినా సాగర్ కు పదేపదే చుక్కెదురైయ్యింది. మా నియోజక వర్గం ఎమ్మెల్యే సతీష్ రెడ్డికి మాతో మాట్లాడటానికి టైమ్ లేదా అంటూ సాగర్ రగిలిపోయాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఒక్కసారి కూడా తనతో ఎమ్మెల్యే సతీష్ రెడ్డి మాట్లాడలేదని సాగర్ కక్ష పెంచుకున్నాడు.

చోరీ చేసిన బైక్.... ఫ్రెండ్స్ తో స్కెచ్

చోరీ చేసిన బైక్.... ఫ్రెండ్స్ తో స్కెచ్

స్నేహితులు శ్రీధర్, నవీన్ తో కలిసి సాగర్ ఓ బైక్ చోరీ చేశాడు. చోరీ చేసిన బైక్ లో రెండు రోజుల క్రితం అర్దరాత్రి సాగర్ అతని ఇద్దరు స్నేహితులు శ్రీధర్ ,నవీన్ తో కలిసి ఎమ్మెల్యే సతీష్ రెడ్డి ఇంటి దగ్గరకు వెళ్లాడు. ఎమ్మెల్యే సతీష్ రెడ్డి ఇంటి కాంపౌండ్ ఆవరణంలో పార్క్ చేసిన విలాసవంతమైన, ఖరీదైన కార్ల మీద చోరీ చేసిన బైక్ లోని పెట్రోల్ పోసి నిప్పంటించారు. కార్లకు నిప్పంటుకున్న వెంటనే ముగ్గురు అక్కడి నుంచి ఎస్కేప్ కావడం, తరువాత ఆ విషయం అందరికి తెలిసిపోవడంతో బెంగళూరులో కలకలం రేపింది.

 ఐటీ హబ్ లో హాట్ టాపిక్

ఐటీ హబ్ లో హాట్ టాపిక్

బెంగళూరులోని బోమ్మనహళ్ళి నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి ఇంటి ఆవరణంలో విలాసవంతమైక కార్లకు ఒకేసారి నిప్పంటి బూడిద చెయ్యడం ఐటీ హబ్ బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరు నగర పోలీసు కమీషనర్ కమల్ పంత్ వెంటనే ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించారు.

400 సీసీటీవీ కెమెరాల్లో ?

400 సీసీటీవీ కెమెరాల్లో ?


కేసు నమోదు చేసిన పోలీసులు వివిద కోణాల్లో దర్యాప్తు చేశారు. సతీష్ రెడ్డి ఇంటి దగ్గర, ఆ వీధిలో, ఆ ఏరియాతో పాటు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 400కు పైగా సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. సతీష్ రెడ్డి కార్లకు నిప్పంటించి పారిపోతున్న సమయంలో నిందితులు చోరీ చేసిన బైక్ ఆచూకి కనిపెట్టిన పోలీసులు రంగంలోకి దిగారు.

 లక్ష రూపాయలు బహుమానం

లక్ష రూపాయలు బహుమానం

సతీష్ రెడ్డి కార్లకు నిప్పంటించే సమయంలో పెట్రోల్ పడి ఓ నిందితుడి కాలికి గాయాలైనాయి. బోమ్మనహళ్ళి ఏరియాలో గాయాలై చికిత్స పొందుతున్న వారి వివరాలు సేకరించిన పోలీసులు చాకచక్యంగా సాగర్, శ్రీధర్, నవీన్ ను అరెస్టు చేశారని బెంగళూరు నగర పోలీసు కమీషనర్ కమల్ పంత్ మీడియాకు చెప్పారు. ఎమ్మెల్యే సతీష్ రెడ్డి కార్లు దగ్దం చేసిన నిందితులను రెండు రోజుల్లో అరెస్టు చేసిన ప్రత్యేక పోలీసు టీమ్ లకు రూ. 1 లక్ష బహుమానం అందించామని బెంగళూరు నగర పోలీసు కమీషనర్ కమల్ పంత్ మీడియాకు చెప్పారు.

ఎమ్మెల్యే సతీష్ రెడ్డి క్లారిటీ

ఎమ్మెల్యే సతీష్ రెడ్డి క్లారిటీ


తన కార్లు బూడిద చేసి పారిపోయిన ముగ్గురు నిందితులు అరెస్టు అయ్యారని తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి స్పంధించారు. నిందితులు ఎందుకు తన కార్లకు నిప్పంటించారు, వారి ఉద్దేశం ఏమిటి అనే విషయం తనకు బాగా తెలుసని, ఇది పక్కాప్లాన్ తో చేశారని తనకు అనుమానం ఉందని, పోలీసులు వారిపని వారు చేశారని బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి అన్నారు. తనకు గిట్టనివాళ్లు ఇలా చేశారని బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి పరోక్షంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి కార్లను పక్కాప్లాన్ తో కాల్చి బూడిద చేసిన ముగ్గురు నిందితులు అరెస్టు కావడం బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
IT Hub: Bengaluru Bommanahalli MLA Satish Reddy's cars set fire case solved by Bengaluru police. Bengaluru police commissioner Kamalpant Press meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X