Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సిద్దూ ప్రభుత్వం వస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలకు బ్రేక్ లు పడుతాయి, జేపీ నడ్డా సంచలనం!

బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా గాలి కరుణాకర్ రెడ్డిని గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో బీజేపీ నాయకులు ఇరుకునపడ్డారు. కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వస్తే కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు బ్రేకులు పడుతాయని జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్నీ కొనసాగుతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారని ప్రముఖ కన్నడ దినపత్రిక ప్రజావాణి కథనం ప్రచురించింది. పరప్పనహళ్లిలో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే గాలి కరుణాకర్ రెడ్డి (గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు)కి మద్దతుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం చేశారు.

JP Nadda said that if Congress comes to Karnataka, all central government schemes will stop

కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గరీబ్ యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజనతో పాటు ప్రతిరోజు పిల్లలకు అర్దలీటర్ పాలు ఉచితంగా ఇచ్చే పథకాలు అన్ని కొనసాగుతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

ఒకవేళ కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి కూడా కర్ణాటకలో బ్రేకులు పడతాయని జేపీ నడ్డా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిద్దరామయ్య సీఎంగా ఉన్న సమయంలో చాలా అవినీతి జరిగిందని జేపీ నడ్డా ఆరోపించారు.

బోరుబావుల స్కామ్, బెంగళూరులోని అర్కావతి డినోటిఫికేషన్, పీఎఫ్ఐ. మలప్రభా నది కాలువ పథకం, స్టీల్ ఫ్లై ఓవర్ టెండర్ల స్కామ్ లు అన్ని సిద్దరామయ్య సీఎంగా ఉన్న సమయంలోనే జరిగాయని జేపీ నడ్డా ఆరోపించారు. ఇంత అవినీతికి పాల్పడిన సిద్దరామయ్యకు బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదని జేపీ నడ్డా మండిపడ్డారు.

సిద్దరామయ్య ప్రభుత్వంలోని ఈ స్కామ్ ల గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదని జేపీ నడ్డా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ను ప్రశ్నించారు. అయితే బీజేపీని గెలిపించకపోతే కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్ని నిలిపివేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కన్నడిగులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+