Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాజీ ముఖ్యమంత్రికే దిక్కులేదు: పార్టీకి గుడ్‌బై

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి. బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు.

పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తోన్నారు. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేకు ఇది సొంత రాష్ట్రం కావడం వల్ల అటు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంది. కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు సీనియర్ నేతలు కర్ణాటకలో మకాం వేయనున్నారు.

 Former CM Jagadish Shettar has announced resignation

ఏఐసీసీ మాజీ అధినేత రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు కర్ణాటకలో పర్యటించనున్నారు. ఇవ్వాళ ఆయన పర్యటన ప్రారంభం కానుంది. కోలార్‌లో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్.. బస్సు యాత్ర ద్వారా రాష్ట్రం మొత్తాన్నీ చుట్టేస్తోన్నారు.

కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్.. అభ్యర్థుల జాబితాను ఒక్కటొక్కటిగా విడుదల చేస్తోన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇదివరకే రెండు విడతల్లో ఈ జాబితాను విడుదల చేసింది. ఆదివారం మూడో దశలో అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మూడో విడతలో 43 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవాదికి కాంగ్రెస్ టికెట్ లభించింది. బెళగావి జిల్లాలోని అథణి నియోజకవర్గం నుంచి లక్ష్మణ సవాదిని ఎన్నికల బరిలోకి దింపింది కాంగ్రెస్.

ఇప్పుడు తాజాగా లక్ష్మణ సవాది బాటలో బీజేపీకే చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ కూడా సాగనున్నారు. ఆయనకు కూడా టికెట్ లభించలేదు. దీనితో పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మధ్యాహ్నం ఆయన బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ లేదా జేడీఎస్‌లల్లో జగదీష్ షెట్టార్ చేరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

హుబ్లీ-ధార్వాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వరుసగా అన్ని ఎన్నికల్లోనూ గెలుస్తూ వస్తోన్నారు జగదీష్ షెట్టార్. కుమారస్వామి ప్రభుత్వంలో బీజేపీ తరఫున ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత ఆయన. యువతకు టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో షెట్టార్‌ను పక్కన పెట్టింది బీజేపీ. ఈ సారి పోటీ నుంచి తప్పుకోవాలని ఆదేశించింది.

దీనిపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కర్ణాటకకే చెందిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర ఇన్‌ఛార్జ్, మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశం అయ్యారు. తన అసంతృప్తిని బహిరంగంగానే తెలియజేశారు. టికెట్ల కేటాయింపులో పార్టీ నిర్ణయమే శిరోధార్యమంటూ ఇద్దరు కేంద్రమంత్రులు తేల్చి చెప్పడంతో రాజీనామా చేయాలని షెట్టార్ నిర్ణయించారు. రాజీనామా లేఖను అందజేయడానికి అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+