బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

COVID-19: లాక్ డౌన్, కర్ఫ్యూ, సీఎం క్లారిటీ, బర్త్ డేలు, పెళ్లిళ్లు, నాలుగు గోడల మధ్యే ఇదంతా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారతదేశంలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి మరోసారి భరతనాట్యం చేస్తోంది. భారతదేశంలో కరోనా వైరస్ ఊహించని విధంగా వ్యాపిస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యి చర్చించారు. ఇదే సమయంలో బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారు అంటూ జోరుగా ప్రచారం మొదలైయ్యింది. మరోసారి లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేసే విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కర్ణాటక ప్రజలకు పక్కాక్లారిటీ ఇచ్చేశారు. భర్త్ డేలు, పెళ్లిళ్లు, నాలుగు గోడల మధ్య జరిగే శుభకార్యాల వలనే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోందని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు.

Bengaluru: ఐటీ సిటీలో కరోనా గంగజాతర, మాస్క్ లేదు, మటన్ లేదు, 53%, 10 రోజుల్లో పండగ!Bengaluru: ఐటీ సిటీలో కరోనా గంగజాతర, మాస్క్ లేదు, మటన్ లేదు, 53%, 10 రోజుల్లో పండగ!

మాస్క్ వేసుకోండి ఫ్రెండ్స్

మాస్క్ వేసుకోండి ఫ్రెండ్స్

ప్రస్తుతానికి బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో మరోసారి లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేసే ఉద్దేశం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప స్పష్టం చేశారు. అయితే బెంగళూరు సిటీతో పాటు కర్ణాటక మొత్తం మాస్క్ లేకుండా ఎవ్వరూ బయటకు రాకూడదని సీఎం యడియూరప్ప మనవి చేశారు.

 మాస్క్ లేకుంటే అంతే కథ

మాస్క్ లేకుంటే అంతే కథ


మాస్క్ లేకుండా బయటకు వచ్చి కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం అయ్యే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని సీఎం యడియూరప్ప హెచ్చరించారు. ఇక ముందు పబ్లిక్ ప్రాంతాలు, శుభకార్యాలు జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వం సూచించిన కట్టుదిట్టమైన నియమాలు పాటించాలని కర్ణాటక సీఎం బీఎస్, యడియూరప్ప ప్రజలకు సూచించారు.

నాలుగు గోడల మధ్యలో !

నాలుగు గోడల మధ్యలో !

కరోనా వైరస్ ను అరికట్టడానికి ముఖ్యంగా శుభకార్యాల మీద నిఘా వెయ్యాల్సిన అవసరం ఉందని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు. వివాహ శుభకార్యాలు, జన్మదినవేడుకలతో పాటు నాలుగు గోడల మధ్య శుభకార్యాల కారణంగా కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు. ప్రతి శుభకార్యంలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా ముఖాలకు మాస్క్ లు వేసుకోవాలని, కనీస భౌతిక దూరం పాటించాలని సీఎం బీఎస్. యడియూరప్ప సూచించారు.

 కరోనా సెకండ్ వేవ్

కరోనా సెకండ్ వేవ్


కరోనా వైరస్ సెకండ్ వేవ్ అరికట్టడానికి ప్రజలు సహకరించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్న ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్లుగా గుర్తించి ఆ వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించుకుండా చూడాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు.

రోజుకు 3 లక్షల మందికి కరోనా టీకాలు

రోజుకు 3 లక్షల మందికి కరోనా టీకాలు

కర్ణాటకలో మొత్తం 3,500 కరోనా టీకాల కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతిరోజు 3 లక్షల మందికి కరోనా టీకాలు వేసేలా అన్ని చర్యలు తీసుకున్నామని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు. బెంగళూరులో కరోనా వైరస్ ను అరికట్టడానికి వైద్యశాఖ అధికారులు, సిబ్బంది, బీబీఎంపీ అధికారులు సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. మొత్తం మీద బెంగళూరుతో పాటు కర్ణాటకలో ప్రస్తుతానికి లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేసే ఆలోచనలేదని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప తేల్చి చెప్పారు.

English summary
Karnataka Chief Minister BS Yediyurappa Press Meet After Covid19 Review Meeting With PM Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X