కరోనా విలయం: కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణరావు మృతి - కర్ణాటకలో వరుస విషాదాలు
కరోనా మహమ్మారి విలయతాండవానికి బలైపోతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి సురేశ్ అంగడి కరోనాతో చనిపోయి 24 గంటలైనా గడవకముందే.. అదే రాష్ట్రానికి చెందిన మరో ఎమ్మెల్యే మృత్యువాతపడ్డారు.
బీదర్ జిల్లాలోని బసవకల్యాణ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న బి.నారాయణరావు(65) బుధవారం కన్నుమూశారు. పాజిటివ్ గా తేలడంతో సెప్టెంబర్ 1న బెంగళూరులోని మణిపూర్ ఆస్పత్రిలో చేరగా.. రెండ్రోజుల కిందట ఆరోగ్యం మరింత విషమించింది. చివరికి ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యే తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

కొవిడ్ కారణంగా ఎమ్మెల్యే శరీర భాగాలు బాగా దెబ్బతిన్నాయని, వెంటిలేటర్ ద్వారా లైఫ్ సపోర్టు అందించినా ఫలితం లేకపోయిందని మణిపూర్ ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. నారాయణరావు మరణవార్త తెలిసిన వెంటనే.. కర్ణాటక అసెంబ్లీని అర్ధాంతరంగా వాయిదా వేసి, నేతలందరూ ఆస్పత్రికి తరలివెళ్లారు.
Recommended Video
నారాయణరావు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, తన జీవితకాలమంతా ఆయన పేదల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. ఎమ్మెల్యే మృతిపై సీఎం యడ్యూరప్ప సహా పార్టీలకు అతీతంగా నేతలు నివాళులు అర్పించారు. రెండు రోజుల వ్యవధిలోనే రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు చనిపోవడం అందరిలో విషాదాన్ని నింపింది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications