గుండూరావుకు కరోనా పాజిటివ్ - ఇప్పటికే ఓ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే బలి - కర్ణాటకలో సీన్ ఇది

కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత, ఎమ్మెల్యే, తమిళనాడు, గోవా, పాండిచేరి వ్యవహారాల ఏఐసీసీ ఇన్ చార్జి దినేశ్ గుండూరావు కరోనా కాటుకు గురయ్యారు. తనకు వైరస్ సోకిన విషయాన్ని ఆదివారం ట్విటర్ ద్వారా వెల్లడించిన ఆయన.. స్వల్ప లక్షణాలతో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నానని, ఇటీవల తనతో కాంటాక్ట్ అయినవాళ్లంతా విధిగా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ప్రస్తుతం కొనసాగుతోన్న కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో పాల్గొన్న గుండూరావు పాజిటివ్ గా తేలడం ఇతర నేతలనూ కలవరపెడుతోంది. ఈనెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. కర్ణాటకలో ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణరావు కన్నుమూయడం తెలిసిందే. అంతకు ఒక రోజు ముందు, ఇదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి సురేశ్ అంగడి కన్నుమూశారు.

Karnataka Congress MLA Dinesh Gundu Rao tests COVID-19 positive

ప్రతి రోజూ 10వేలకు దగ్గరగా కేసులు, 100కు దగ్గరగా మరణాలు నమోదవుతూ కోవిడ్ బాధిత రాష్ట్రాల జాబితాలో కర్ణాటక పైపైకి పోతున్నది. శనివారం ఒక్కరోజే కొత్తగా 8,811 కేసులు, 86 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 5.66లక్షలకు, మరణాల సంఖ్య 8,503కు పెరిగాయి. లక్షకుపైగా యాక్టివ్ కేసులతో మహారాష్ట్ర (2.69లక్షలు) తర్వాతి స్థానంలో కర్ణాటక కొనసాగుతున్నది.

Recommended Video

    #BharatBandh : 29 వరకూ రైల్ రోకో, రైతు నిరసనలు,నినాదాలతో దద్దరిల్లిన రాష్ట్రాలు ! || Oneindia

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+