సీఎం పేరు ప్రకటించక ముందే బాంబు పేల్చిన మాజీ డీసీఎం, ఉచిత హామీల కథ?!
బెంగళూరు/తుమకూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్రజలకు ఉచిత హామీలు ఇచ్చి ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఐదు ఉచిత గ్యారెంటీల హామీలు ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీలను చిత్తుచేసి 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న విషయం తెలిసిందే.
అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ఉచిత హామీలను కర్ణాటక ప్రజలు అందరికి అమలు చెయ్యడం సాధ్యం కాదని, ఆపథకాలు పొందాలంటే కొన్ని షరతులు ఉంటాయని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే డాక్టర్ జీ. పరమేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చెయ్యడం ఇప్పుడు కర్ణాటకలో కలకలం రేపింది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తే దళిత వర్గానికి చెందిన డాక్టర్ జీ పరమేశ్వర్ కు గ్యారెంటీగా పదవి దక్కుతుంది. దళితుడైన డాక్టర్ జీ. పరమేశ్వర్ ను ముఖ్యమంత్రి చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తూ మంగళవారం ఆయన మద్దతుదారులు తుమకూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇలాంటి సయంలో డాక్టర్ జీ పరమేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ఉచిత హామీలను నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని డాక్టర్ పరమేశ్వర్ అన్నారు. ఫస్ట్ క్యాబినేట్ మీటింగ్ లోనే సంబంధిత మంత్రులతో చర్చించి ఉచిత పథకాలు ఎవరికి అందించాలి అని నిర్ణయం తీసుకుంటామని డాక్టర్ పరమేశ్వర్ అన్నారు.
కర్ణాటకలోని ప్రజలు అందరికి ఉచిత హామీలు నెరవేర్చాలంటే అది సాధ్యం కాదని, ఆ పథకనాలు దారితప్పే అవకాశం ఉందని డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత హామీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆరోజు ఎందుకు షరతులు వర్తిస్తాయి అని ఎందుకు ప్రకటించలేదు అని మీడయా అడిగిన ప్రశ్నకు డాక్టర్ పరమేశ్వర్ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.
మొత్తం మీద ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని అందరికి అమలు చెయ్యడం సాధ్యం కాదని కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యకముందే ఆపార్టీ సీనియర్ నాకుడు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయంలో బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications