మోదీ హయాంలో తొలిసారిగా తగ్గిన రేట్లు- జనాలకు ఊరట

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రధాన పార్టీలన్నీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నాయి. జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తోన్నాయి. కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్), ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార భారతీయ జనతా పార్టీ దీనిపై ఇంకా కసరత్తు కొనసాగిస్తూనే ఉంది.

కర్ణాటకలోని మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి. బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు.

GAIL reduce the prices of CNG

ఇవ్వాళ ఆయన కర్ణాటకలోని బండీపూర్ నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పర్యటించారు. టైగర్ రిజర్వ్ ప్రాజెక్టును ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మైసూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. పులుల సంరక్షణ కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. జీవ వైవిధ్యానికి భారత్ ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వేళ- ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టయిందనే విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో- కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కీలక నిర్ణయాలను తీసుకుంది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) రేట్లను భారీగా తగ్గించింది. స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ ఒక్కింటికి ఏడు రూపాయల మేర కుదించింది.

ఈ తగ్గింపును బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, దక్షిణ కన్నడ జిల్లాలకు వర్తింపజేసింది. బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్ జిల్లాల్లో ఒక్కో స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు ఏడు రూపాయలు, దక్షిణ కన్నడ జిల్లాలో ఆరు రూపాయల మేర తగ్గింది. గెయిల్ తీసుకున్న ఈ తాజా చర్యల వల్ల సీఎన్జీ, పీఎన్జీ రేట్లు తగ్గాయి.

ఈ మూడు జిల్లాల్లో వేలాది కుటుంబాలకు లబ్దిని కలిగించినట్టయింది కేంద్ర ప్రభుత్వం. ధరల తగ్గింపు ప్రభావం దేవాస్, మీరట్, సోనీపట్, తాజ్ ట్రాపెజియం జోన్, రైసెన్, మీర్జాపూర్, ధన్‌బాద్, ఆదిత్యపూర్, రూర్కెలాలో ఒక్కో స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ ధర 52.50 పైసలకు తగ్గింది. బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఒక ఎస్సీఎంకు రూ. 51.50 పైసలు పలుకుతోంది.

మీరట్, సోనిపట్‌లల్లో కిలో సీఎన్జీ 85 రూపాయలు, దేవాస్, తాజ్ ట్రాపెజియం జోన్, డెహ్రాడూన్‌‌లల్లో 92 రూపాయలు, బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, దక్షిణ కన్నడ జిల్లాల్లో కిలో 82.50 రూపాయలు, మిర్జాపూర్‌కు కిలో 87 రూపాయలు, రైసెన్, ధన్‌బాద్, ఆదిత్యపూర్‌, పూరీ, రూర్కెలాల్లో కిలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ 91 రూపాయలు పలుకుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+