హిజాబ్ పై తాత్కాలిక నిషేధం-తుది తీర్పు వచ్చే వరకూ- కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కర్నాటక హిజాబ్ వ్యవహారం ఇవాళ మరో మలుపు తిరిగింది. హిజాబ్ పై ముస్లిం విద్యార్ధినులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుపుతున్న కర్నాటక హైకోర్టు విస్తృత ధర్మాసనం... ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వచ్చే వరకూ విద్యాసంస్ధల్లో ముసుగులు ధరించకుండా సంయమనం పాటించాలని హైకోర్టు తమ ఉత్తర్వుల్లో పేర్కొంది.
హిజాబ్ వివాదంపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన కర్నాటక హైకోర్టు.. ఇవాళ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. కర్నాటకలోని కళాశాలలు తిరిగి తెరవవచ్చని పేర్కొంది. కానీ విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించడానికి అనుమతించరాదని కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. కళాశాలలో విద్యార్థులు 'హిజాబ్' ధరించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కర్ణాటక హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది.

దీనిపై సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. అయితే కేసును వాయిదా వేయడానికి ముందు, చీఫ్ జస్టిస్ రీతు రాజ్ అవస్తీ కర్ణాటకలో కాలేజీలు తిరిగి తెరవవచ్చని, అయితే ఈ విషయం కోర్టులో పెండింగ్‌లో ఉన్నంత వరకు ఏ విద్యార్థి కూడా మతపరమైన దుస్తులు ధరించరాదని సూచించారు.












Click it and Unblock the Notifications