Leader: రాజకీయం బయట చెయ్యాలి, ప్రభుత్వ కార్యాలయాల్లో కాదు, మాకు టైమ్ వస్తుంది, డీకేఎస్!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ న్యూఢిల్లీలో ఈడీ అధికారులు ముందు విచారణకు హాజరై అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి తిరిగి బెంగళూరు చేరుకున్నారు. ఈడీ అధికారులు నోటీసులు జారీ చెయ్యడంతో శుక్రవారం డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లి ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
డీకే. శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ కు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు ఢిల్లీలోని కార్యాయానికి పిలిపించుకుని వివరాలు సేకరించారు. బెంగళూరు చేరుకున్న డీకే శివకుమార్ ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో ఏం జరిగింది అనే విషయం మీడియాకు చెప్పారు.
Girl:
స్కూల్
వాష్
రూమ్
లో
అమ్మాయి
మీద
సీనియర్లు
సామూహిక
అత్యాచారం,
మహిళా
కమీషన్
నోటీసు!

పాదయాత్ర ఎఫెక్ట్
రాహుల్ గాంధీ చేపట్టిన కన్యాకుమారి టూ కాశ్మీర్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. కర్ణాటకలో రాహుల్ గాంధీ పాదయాత్ర సక్సస్ చెయ్యాలని, అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ ఏ టూ ఝడ్ ఆయనే చూసుకుంటున్నారు.

ఈడీ దెబ్బతో ఢిల్లీకి డీకే
నేషనల్ హెరాల్డ్ స్కామ్ కు సంబంధించి ఈడీ అధికారులు డీకే శివకుమార్ కు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఢిల్లీ చేరుకున్న డీకే. శికుమార్ ఏపీజే అబ్దుల్ కలామ్ రోడ్డులోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరై అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

బీజేపీ రాజకీయం చేస్తోంది
ఈడీ అధికారుల విచారణ పూర్తి చేసుకున్న డీకే శివకుమార్ బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర డీకే. శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ కార్యాలయానికి మమ్మల్ని విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇప్పించి బీజేపీ రాజకీయ కక్ష సాధింపులు సాగిస్తున్నారని డీకే శివకుమార్ ఆరోపించారు.

గాంధీ, నెహ్రూ కాలం నాటి పత్రిక
మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాలంలో మా పార్టీ నాయకులు స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మీరు ఎందుకు నిధులు ఇచ్చారు, మీకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ఈడీ అధికారులు మమ్మల్ని ప్రశ్నించారని డీకే శివకుమార్ అన్నారు.

2023లో బీజేపీకి ప్రజలే బుద్ది చెబుతారు
ఆనాటి పత్రిక సంబంధించిన వివరాలను కర్ణాటకలో రాహుల్ గాంధీ పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే మమ్మల్ని విచారణ పిలిచి వేధింపులకు గురి చేస్తున్నారని, రాజకీయం బయట చెయ్యాలి కాని ప్రభుత్వ కార్యాలయాల్లో (ఈడీ, ఐటీ శాఖ) చెయ్యకూడదని డీకే శివకుమార్ బీజేపీ నాయకుల మీద విరుచుకుపడ్డారు. 2023లో బీజేపీ నాయకులకు ప్రజలే బుద్ది చెబుతారని డీకే శివకుమార్ అన్నారు.