Lovers: అత్త కూతురిని చంపిన యువకుడు, సేమ్ ప్లేస్ లో నెల రోజులకు శవమైనాడు, శవాన్ని కుక్కలు లాగి!
బెంగళూరు/రాయచూరు: స్కూల్ లో చదువుతున్న అమ్మాయికి అత్త కొడుకు ఉన్నాడు. వయసుకు వచ్చిన అత్త కూతురిని ఆ యువకుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అమ్మాయి, యువకుడు చాలా దగ్గర బంధువులు కావడంతో మీకు పెళ్లి చేస్తామని ఇరువైపుల కుటుంబ సభ్యులు సంవత్సరం క్రితమే చెప్పారు. పెళ్లి చేసుకుంటున్నామని ఆ అమ్మాయి, యువకుడు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. అయితే కొంతకాలం క్రితం కుటుంబ సభ్యుల మద్య తేడాలు రావడంతో ఇద్దరికి పెళ్లి చెయ్యకూడదని పెద్దలు డిసైడ్ అయ్యారు. పెద్దలు అంగీకరించకపోయినా సరే మనం పెళ్లి చేసుకుందామని ఆ యువకుడు అతని అత్త కూతురికి చెప్పాడు.
నేను మా ఇంట్లో చెప్పినట్లు వింటానని అమ్మాయి తేల్చి చెప్పింది.. రగిలిపోయిన యువకుడు అతని సొంత అత్తకూతురిని దారుణంగా చంపేసి శవాన్ని పొదల్లో విసిరేశాడు. అమ్మాయి హత్యకు గురి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. పోలీసులు 33 రోజుల నుంచి యువకుడి కోసం గాలిస్తూనే ఉన్నారు. అయితే అమ్మాయి ఎక్కడ అయితే హత్యకు గురైయ్యిందో అదే ప్లేస్ లోని ముళ్లపొదల్లో నెల రోజుల తరువాత ఆమె అత్త కొడుకు కూడా శవమై కనిపించడం కలకలం రేపింది.

సొంత అత్తకూతురు
కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని మస్కిలో రమేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నారు. రమేష్ కు సొంత అత్తకూతురు భూమిక (15) అనే యువతి ఉంది. భూమిక మస్కిలోని స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. వయసుకు వచ్చిన అత్త కూతురు భూమికను పెళ్లి చేసుకోవాలని రమేష్ అనుకున్నాడు.

పెళ్లి చెస్తామని చెప్పిన పెద్దలు
రమేష్, భూమిక చాలా దగ్గర బంధువులు కావడంతో మీకు పెళ్లి చేస్తామని ఇరువైపుల కుటుంబ సభ్యులు సంవత్సరం క్రితమే చెప్పారు. పెళ్లి చేసుకుంటున్నామని రమేష్, భూమిక చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. భూమికకు చదువు పూర్తి అయిన తరువాత పెళ్లి చెయ్యాలని మొదట పెద్దలు మాట్లాడుకున్నారు.

పెళ్లి క్యాన్సిల్ చేసిన పెద్దలు
కొంతకాలం క్రితం రమేష్, భూమికల కుటుంబ సభ్యుల మద్య తేడాలు రావడంతో గొడవలు జరిగాయి. ఈ సందర్బంలో రమేష్, భూమికల పెళ్లి చెయ్యకూడదని వాళ్ల పెద్దలు డిసైడ్ అయ్యారు. పెద్దలు అంగీకరించకపోయినా సరే మనం పెళ్లి చేసుకుందామని రమేష్ అతని అత్తకూతురు భూమికకు చెప్పాడు. నేను మా ఇంట్లో చెప్పినట్లు వింటానని భూమిక ఆమె అత్త కొడుకు రమేష్ కు తేల్చి చెప్పింది.

అత్త కూతురిని చంపేశాడు
అత్త కూతురిమీద రమేష్ మండిపడ్డాడు. కొన్ని రోజులు ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. అత్త కూతురు భూమిక మీద రగిలిపోయిన రమేష్ యువకుడు అతని సొంత అత్తకూతురు భూమికను మార్చి 25వ తేదీన మస్కి సమీపంలో దారుణంగా చంపేశాడు. తరువాత అత్త కూతురు భూమిక శవాన్ని పొదల్లో విసిరేసిన రమేష్ పరారైనాడు.

అదే ప్లేస్ లో శవమైన యువకుడు
భూమిక హత్యకు గురి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు రమేష్ మీద పోలీసు కేసు పెట్టారు. పోలీసులు 33 రోజుల నుంచి రమేష్ కోసం రాయచూరు, బెంగళూరుతో పాటు అనేక ప్రాంతాల్లో గాలిస్తూనే ఉన్నారు. అయితే భూమిక అమ్మాయి ఎక్కడ అయితే హత్యకు గురైయ్యిందో అదే ప్లేస్ లోని ముళ్లపొదల్లో 33 రోజుల తరువాత ఆమె అత్త కొడుకు రమేష్ కూడా శవమై కనిపించడం కలకలం రేపింది.

శవాన్ని కుక్కలు బయటకు లాగితే మ్యాటర్ తెలిసింది
రమేష్ చాలా రోజుల క్రితమే విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడని, అతని శవాన్ని కుక్కలు బయటకు లాగిన సమయంలో గొర్రెలు మేపుకునే వాళ్లు చూసి సమచారం ఇచ్చారని పోలీసులు అన్నారు. భూమికను హత్య చేసిన తరువాత భయంతో రమేష్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద అత్తకూతురు భూమికను హత్య చేసిన రమేష్ అదే ప్లేస్ లో ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించడం కలకలం రేపింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications