Murder: బర్త్ డే పార్టీకి వెళ్లిన యువకుడు, నడిరోడ్డులో వెంటాడి చంపేశారు, తల్లి ఫైర్, పోలీసుల లెక్కలు వేరే!
బెంగళూరు: సాయంత్రం ఇంటికి వెళ్లిన యువకుడు అతని మొబైల్ ఫోన్ లో వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నాడు .ఇంట్లో యువకుడి తల్లి కూడా ఉంది. రైల్వే శాఖలో ఆ యువకుడు అప్రెంటిస్ గా ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రి ఆ యువకుడికి అతని స్నేహితులు ఫోన్ చేశారు. తన బర్త్ డే సందర్బంగా అందరూ బయట హోటల్ లో బిరియానీ, చికెన్ కబాబ్ తిందామని, నువ్వు కూడా రావలని అతనికి చెప్పారు. స్నేహితులతో కలిసి బయట బిరియానీ తినేసి వస్తానని ఆ యువకుడు తల్లికి చెప్పాడు.
స్నేహితులతో వెలుతున్నాడని అతని తల్లి కూడా సరే అని చెప్పింది. బిరియాని తినడానికి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురైనాడు. యువకుడిని నడిరోడ్డు మీద దారుణంగా నరికి చంపేస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమోరాల్లో రికార్డు అయ్యింది, కన్నడ బాష మాట్లాడాడని, ఉర్దూ మాట్లాడలేదని యువకుడిని చంపేశారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు.
భోజనం చెయ్యడానికి వెలుతున్న సమయంలో యువకుడి బైక్ మరో యువకుడి బైక్ కు టచ్ అవ్వడం వలనే గొడవ మొదలైయ్యిందని, తరువాత కన్నడ, ఉర్దు బాషల విషయంలో గొడవ పెద్దది అయ్యిందని హత్యకు గురైన యువకుడి స్నేహితులు అంటున్నారు. అయితే కావాలని యువకుడిని వెంటాడి చంపేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సంతోషంగా ఉంటున్న యువకుడు
బెంగళూరులోని జగజ్జీవన్ రామ్ నగర్ (జేజే నగర్)లో చంద్రశేఖర్ అలియాస్ చంద్రూ (20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఐటీఐ పూర్తి చేసిన చంద్రూ రైల్వే శాఖలో అప్రెంటిస్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతిరోజు ఉద్యోగానికి వెలుతున్న యువకుడు ఖాళీ సమయంలో అతని స్నేహితులతో కలిసి తిరుగుతున్నాడు.

సాయంత్రం ఇంట్లోనే ఉన్నాడు
సాయంత్రం ఇంటికి వెళ్లిన చంద్రు అతని మొబైల్ ఫోన్ లో వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నాడు .ఇంట్లో చంద్రూ తల్లి కూడా ఉంది. రైల్వే శాఖలో ఆ యువకుడు అప్రెంటిస్ గా ఉద్యోగం చేస్తున్న చంద్రూ చాలా హ్యాపీగా ఉంటున్నాడు. రాత్రి చంద్రూకు అతని స్నేహితుడు సైమన్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అంటూ ఆరా తీశారు.

ఫ్రెండ్ బర్త్ డే పార్టీ
ఈ రోజు తన బర్త్ డే అని, ఫ్రెండ్స్ అందరూ బయట హోటల్ లో బిరియానీ, చికెన్ కబాబ్ తిందామని, నువ్వు కూడా రావలని సైమన్ అతని స్నేహితుడు చంద్రూకు చెప్పాడు. స్నేహితులతో కలిసి బయట బిరియానీ తినేసి వస్తానని చంద్రూ తల్లికి చెప్పాడు. స్నేహితులతో వెలుతున్నాడని చంద్రూ బయటకు వెళ్లడానికి అతని తల్లి కూడా సరే అని చెప్పింది.

సీసీటీవీ కెమెరాల్లో?
బిరియాని తినడానికి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన చంద్రూ అర్దరాత్రి దాటిన తరువాత 2 గంటల సమయంలో హళే గుడ్డదహళ్లి ప్రాంతంలో దారుణ హత్యకు గురైనాడు. చంద్రూను నడిరోడ్డులో దారుణంగా నరికి చంపేస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమోరాల్లో రికార్డు అయ్యింది,

ఉర్దూ మాట్లాడలేదని హత్య?
చంద్రూ కన్నడ బాష మాట్లాడాడని, ఉర్దూ మాట్లాడలేదని అతన్ని చంపేశారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. భోజనం చెయ్యడానికి వెలుతున్న సమయంలో చంద్రూ నడుపుతున్న బైక్ మరో యువకుడి బైక్ కు టచ్ అవ్వడం వలనే గొడవ మొదలైయ్యిందని, తరువాత కన్నడ, ఉర్దు బాషల విషయంలో గొడవ పెద్దది అయ్యిందని హత్యకు గురైన చంద్రూ స్నేహితులు ఆరోపిస్తున్నారు.

పక్కాప్లాన్ తో చంపేశారంటున్న తల్లి
అయితే కావాలని పక్కాప్లాన్ తో చంద్రూను వెంటాడి చంపేశారని, ఉర్దూ మాట్లానందుకు చంపేస్తారా అని అతని తల్లి ప్రశ్నిస్తోంది. చంద్రూ హత్య కేసులో ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, హంతకుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ అనుచేత్ బుధవారం మీడియాకు చెప్పారు. చంద్రూ హత్యను కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర ఖండించారు. హంతకులను త్వరలో అరెస్టు చేస్తామని, బైక్ యాక్సిడెంట్ కారణంగానే చంద్రూ హత్యకు గురైనాడని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కమల్ పంత్ అంటున్నారు.












Click it and Unblock the Notifications