Muslim goons: ముస్లీం గూండాలను డీకేసీ రెచ్చగొట్టి అమాయకులను చంపిస్తున్నారు, మంత్రి ఫైర్!
బెంగళూరు: హిజాబ్ వివాదం పెద్దది అయిన సమయంలోనే భజరంగ్ దళ్ కార్యకర్త దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. ముస్లీం గూండాలను రెచ్చగొట్టి అమాయకుడైన యువకుడిని చంపించారు. హిజాబ్ విషయంలో ముస్లీం అమ్మాయిలను రెచ్చగొడుతున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ముస్లీం గూండాలతో అమాయకుడైన ఓ యువకుడిని చంపించారని కర్ణాటక గ్రామీణాభివృద్ది శాఖా మంత్రి కేఎస్. ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి శివమొగ్గలో హర్షా అనే యువకుడు హత్యకు గురి కావడం కలకం రేపింది.
హిజాబ్ వివాదం ఎక్కువగా ఉన్న శివమొగ్గలో ఓ వర్గం ఎక్కువగా నివాసం ఉంటున్న ఏరియాలోనే హర్షా హత్యకు గురి కావడంతో శివమొగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ సీనియర్ నాయకుడు, మంత్రి ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక చీఫ్ డీకే. శివకుమార్ తో పాటు ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

యువకుడి దారుణ హత్య
శివమొగ్గలో నివాసం ఉంటున్న హర్షా (24) అనే యువకుడు ఆదివారం రాత్రి 9. 30 గంటల సమయంలో ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో పక్కాప్లాన్ ప్రకారం ప్రత్యర్థులు హర్షాను దారుణంగా చంపేశారు. ఇంటికి వెలుతున్న హర్షా అనే యువకుడు హత్యకు గురికావడం కలకలం రేపింది.

ఆవేశంతో రగిలిపోయిన స్నేహితులు, స్థానికులు
విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మా వర్గంలోని హర్షాను దారుణంగా హత్య చేశారని తెలుసుకున్న యువకులు శివమొగ్గలోని మొగ్గాన్ ఆసుపత్రి మీద దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ప్రత్యర్ధులు నివాసం ఉంటున్న ఏరియా మీద హర్షా వర్గంలోని యువకులు రాళ్ల వర్షం కురిపించారు. ఇదే సమయంలో హర్షా వర్గం మీద మరో వర్గం దాడులు చేసుకోవడంతో శివమొగ్గ పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అదనపు పోలీసు బలగాలు ఎంట్రీ
విషయం తెలుసుకున్న సోలీసులు రంగంలోకి దిగారు. శివమొగ్గలోని ఆజాద్ నగర్ లో ఉద్రిక్త పరిస్థులు నెల కొన్నాయి. హిజాబ్ వివాదంజరుగుతున్న సమయంలోనే శివమొగ్గలో హర్షా హత్యకు గురి కావడం కలకలం రేపింది. అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొనింది.

ముస్లీం గూండాల పనే
టైలర్ పని చేసుకుని జీవనం సాగిస్తున్న హర్షాను ముస్లీం గూండాలు హత్య చేశారని కర్ణాటక గ్రామీణాభివృద్ది శాఖా మంత్రి కేఎస్. ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ ముస్లీంలను రెచ్చగొట్టడం వలనే హర్షా హత్యకు గురైనాడని కర్ణాటక మంత్రి కేఎస్. ఈశ్వరప్ప ఆరోపించారు. ఆదివారం రాత్రి శివమొగ్గలో హర్షా అనే యువకుడు హత్యకు గురి కావడం కలకం రేపింది.
Recommended Video

హోమ్ మంత్రి క్లారిటీ
కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ గొడవలకు, శివమొగ్గలో హర్షా హత్యకు ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. హర్షాను ఎవరు హత్య చేశారు అనే విషయంలో పోలీసు అధికారుల దగ్గర సమాచారం ఉందని, హంతకులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారని, త్వరలో అన్ని విషయాలు వెళ్లడిస్తామని హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర చెప్పారు. హత్యకు గురైన హర్షా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర హంతకులను త్వరలో అరెస్టు చేస్తామని హమీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications