అసెంబ్లీ ఎన్నికల వేళ..కర్ణాటకకు రూ.16 వేల కోట్ల ప్రాజెక్టులు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో- ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ.. కర్ణాటకపై వరాలజల్లు కురిపిస్తోన్నారు. 16,000 కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ- ప్రచార వేడి పతాక స్థాయికి చేరకుంటోంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందిక్కడ. ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచార కార్యక్రమాలకు పదును పెడుతున్నాయి. జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తోన్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. సీనియర్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే కర్ణాటకకు వచ్చిన విషయం తెలిసిందే. శివమొగ్గలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. మరోసారి ఆయన కర్ణాటకకు రానున్నారు. ఆదివారం మండ్య, హుబ్లీ-ధార్వాడ్ లో పర్యటించనున్నారు. బెంగళూరు-మైసూరు జాతీయ రహదారిని ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:15 నిమిషాలకు హుబ్లీ-ధార్వాడ్‌ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.

PM Modi inaugurate the Bengaluru-Mysuru Expressway from Mandya on March 11

బెంగ‌ళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌‌వేను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్ట్‌లో ఎన్‌హెచ్-275లో భాగంగా బెంగళూరు-నిడఘట్ట-మైసూరు సెక్షన్‌లో.. సుమారు 8,480 కోట్ల రూపాయల వ్యయంతో 118 కిలో మీటర్ల పొడవున ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. బెంగళూరు- మైసూరు మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు 3 గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గిస్తుంది.

మైసూరు-కుశాల నగర మధ్య నాలుగు లేన్ల జాతీయ రహదారికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దీని పొడవు 92 కిలోమీటర్లు. సుమారు 4,130 కోట్ల రూపాయలతో దీన్ని అభివృద్ధి చేయనుంది కేంద్రం. బెంగుళూరుతో కుశాల్‌నగర్ కనెక్టివిటీని పెంచడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం అయిదు గంటలు ఉండగా.. దీన్ని రెండున్నర గంటలకు తగ్గుతుంది.

ప్రధాని మోదీ ఐఐటీ- ధార్వాడ్‌ ను కూడా జాతికి అంకితం చేయనున్నారు. 850 కోట్ల రూపాయలతో దీన్ని కేంద్రం నిర్మించింది. సిద్ధారూఢ స్వామీజీ హుబ్బ‌ళ్లి స్టేష‌న్‌లో ప్ర‌పంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ ఫామ్‌ ను ఆయన ప్రారంభిస్తారు. హొస్పేట - హుబ్లీ - తినైఘాట్ సెక్షన్ విద్యుదీకరణతో పాటు ఆధునికీకరించిన హొస్పేట్ రైల్వే స్టేషన్‌ ను మోదీ ప్రారంభిస్తారు. ఈ రైల్వే స్టేషన్ ను హంపి స్మారక చిహ్నాలను పోలి ఉండేలా నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+