• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Puneeth Rajkumar: తెలుగులో మహేష్ బాబు, కన్నడలో పునీత్ రాజ్ కుమార్, ఆ విషయంలో గ్రేట్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: శ్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం గుండెపోటు ప్రాణాలు వదిలారు. పునీత్ రాజ్ కుమార్ ఈ లోకాన్ని, కోట్లాది మంది అభిమానులను వదిలి ఒంటరిగా వెళ్లిపోయారు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లేనిలోటు శ్యాండిల్ వుడ్ జీర్ణించుకోలేకపోతుంది. స్టార్ హీరోల కొడుకులుగా తెలుగులో మహేష్ బాబు, కన్నడలో పునీత్ రాజ్ కుమార్ బాలనటులుగా నిరూపించుకుని తరువాత స్టార్ హీరోలు అయ్యారు. సమాజసేవా కార్యక్రమాలు చేసే అభిమానులను ముందుండి ప్రోత్సహించే పునీత్ రాజ్ కుమార్ ప్రాణాలు వదిలిన తరువాత ఆయన అభిమానులకు ఆదర్శంగా నిలిచారు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇప్పటికే నేత్రదానం చెయ్యడానికి సంబంధిత పత్రాల మీద సంతకాలు చేశారు. కన్నతండ్రి డాక్టర్ రాజ్ కుమార్ అడుగుజాడల్లోనే పునీత్ రాజ్ కుమార్ నేత్రదానం చేశారు. పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడంతో కర్ణాటక ప్రజలు షాక్ అయ్యారు. పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణంతో బెంగళూరు నగరంతో సహ కర్ణాటక మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. బెంగళూరులో బార్లు, పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేశారు. బెంగళూరులో వివిద ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం పడుతున్నా పునీత్ రాజ్ కుమార్ చికిత్స పొందిన విక్రమ్ ఆసుపత్రి దగ్గర, అభిమానులు చివరి చూపుచూసుకోవడానికి ఆయన పార్థీవదేహం పెట్టడానికి సిద్దం అవుతున్న కంఠీరవ స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం పడలేదు.

Illegal affair: క్లోజ్ ఫ్రెండ్స్, భర్త ఫ్రెండ్ తో ?, పోయేది ఏముందని కిలాడీ గ్రీన్ సిగ్నల్, క్లైమాక్స్ లో !Illegal affair: క్లోజ్ ఫ్రెండ్స్, భర్త ఫ్రెండ్ తో ?, పోయేది ఏముందని కిలాడీ గ్రీన్ సిగ్నల్, క్లైమాక్స్ లో !

 బాలనటుడిగా అవార్డులు.... నటన పుట్టుకతో వచ్చింది

బాలనటుడిగా అవార్డులు.... నటన పుట్టుకతో వచ్చింది

కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్ కుమార్ ముద్దుల కొడుకు పునీత్ రాజ్ కుమార్ కు నటన పుట్టుకతోనే వచ్చింది. తండ్రి రాజ్ కుమార్ నటించిన అనేక సినిమాల్లో బాలనటుడిగా నటించిన పునీత్ రాజ్ కుమార్ అప్పుడే అభిమానులను సొంతం చేసుకున్నాడు. బాలనటుడిగా పునీత్ రాజ్ కుమార్ అవార్డులు సొంతం చేసుకోవడమే కాకుండా అతని నటన, డ్యాన్స్ తో చిన్నతనంలోనే అందరిని ఆకట్టుకున్నాడు.

తెలుగులో మహేష్ బాబు. కన్నడలో పునీత్ రాజ్ కుమార్

తెలుగులో మహేష్ బాబు. కన్నడలో పునీత్ రాజ్ కుమార్

సూపర్ స్టార్ కృష్ణ ఆయన ముద్దుల కొడుకు మహేష్ బాబును అప్పట్లో బాలనటుడిగా వెండి తెరకు ఎలా పరిచయం చేశారో అచ్చం అలాగే శ్యాండిల్ వుడ్ లో డాక్టర్ రాజ్ కుమార్ ఆయన ముద్దుల కొడుకు పునీత్ రాజ్ కుమార్ ను సినిమా రంగానికి పరిచయం చేశారు. తెలుగులో సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణతో కలిసి మహేష్ బాబు ఎలా నటిస్తూ వచ్చాడో అలాగే శ్యాండిల్ వుడ్ లో డాక్టర్ రాజ్ కుమార్ తో కలిసి పునీత్ రాజ్ కుమార్ చాలా సినిమాల్లో నటించారు. రాజ్ కుమార్ కుమారులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ మాత్రం బాల నటులుగా రెండు మూడు సినిమాల్లో నటించినా బాలనటుడిగా పునీత్ రాజ్ కుమార్ కు వచ్చినంత గుర్తింపు తెచ్చుకోలేదు. తరువాత శివరాజ్ కుమార్ హ్యాట్రిక్ హీరోగా ఇప్పటికే 100 సినిమాల హీరోగా సెంచురి హీరో అయ్యాడు.

 కోట్లాది మంది అభిమానులు, తెలుగు హీరోల ఫ్యాన్స్

కోట్లాది మంది అభిమానులు, తెలుగు హీరోల ఫ్యాన్స్


శ్యాండిల్ వుడ్ లో డాక్టర్ రాజ్ కుమార్ కుమారులు హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. పునీత్ రాజ్ కుమార్ సినిమాలను తెలుగు, తమిళ సినీ ప్రేక్షలు పఫ్ట్ రోజు చూడటానికి ఆసక్తి చూపిస్తారు. పునీత్ రాజ్ కు శ్యాండిల్ వుడ్ లో ఎవ్వరికి లేనంత క్రేజ్ ఉంది.

బెంగళూరులో హై అలర్ట్.... మద్యం షాపులు బంద్

బెంగళూరులో హై అలర్ట్.... మద్యం షాపులు బంద్


పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతితో కర్ణాటక ప్రజలు ఉలిక్కిపడ్డారు. పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతితో బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో హై అలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా సెలవుల మీద వెళ్లిన పోలీసులు అందరూ డ్యూటీలో చేరాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా బెంగళూరు నగరంలో బార్లు, పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఆదివారం సాయంత్రం వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

 బెంగళూరు బయలుదేరిన లక్షలాది మంది ఫ్యాన్స్

బెంగళూరు బయలుదేరిన లక్షలాది మంది ఫ్యాన్స్

బెంగళూరులోని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు అదిక సంఖ్యలో మొహరిస్తున్నారు. కర్ణాటకలోని అన్ని జిల్లాల నుంచి పునీత్ రాజ్ కుమార్ అభిమానులు లక్షలాది మంది బెంగళూరు వచ్చే అవకాశం ఉండటంతో ఇతర జిల్లాల పోలీసులు బెంగళూరు పిలిపిస్తున్నారు. సివిల్ పోలీసులతో పాటు కేఎస్ఆర్ పీ రంగాలను రంగంలోకి దింపారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, హోమ్ మంత్రి, డీజీపీ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

English summary
Power Star: Power Star Puneeth Rajkumar passed away at the age of 46. The Karnataka government issued a high alert after the news broke.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X