బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Revenge: కౌన్సిలర్ ను వెంటాడి నరికి చంపేసి ఎస్కేప్, గతంలో తండ్రిని ఇలాగే చంపేశారు. పక్కాస్కెచ్ తో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ హాసన్: రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తి కౌన్సిలర్ గా విజయం సాధించాడు. లోకల్ గా పలుకుబడి సంపాధించుకోవాలని అనుకున్న ఆ యువకుడు అనుచరులను వెంట వేసుకుని తిరుగుతున్నాడు. ప్రస్తుతం ఆ యువకుడు ప్రతిపక్ష పార్టీ కౌల్సిలర్. రాజకీయ ప్రత్యర్థులు ఉండటంతో అతను నగరం వదిలి బయటకు వెళ్లాలన్నా, ఏదైనా శుభకార్యాలకు వెళ్లాలన్నా వెంట అనుచరులను పెట్టుకుని వెలుతుంటాడు.

అయితే పట్టపగలు తనను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని కొంచెం నిర్లంగా బైక్ మీద వెలుతున్న కౌన్సిలర్ ను అందరూ చూస్తున్న సమయంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో వేటకొడవళ్లు, కత్తులతో అతి దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.

గతంలో హత్యకు గురైన యువకుడి తండ్రి కౌన్సిలర్ గా పని చేశాడు. అతన్ని కూడా ఇలాగే నరికి చంపేశారు. ఇప్పుడు కొడుకు కూడా అదే రీతిలో హత్యకు గురికావడంతో వాళ్ల అనుచరులు రగిలిపోతున్నారు.

Illegal affair: దుబాయ్ లో మొగుడు, ఇంట్లో దుప్పటి కింద ప్రియుడు, ఇంటికి వెళ్లి భర్త ఏం చేశాడంటే ?!Illegal affair: దుబాయ్ లో మొగుడు, ఇంట్లో దుప్పటి కింద ప్రియుడు, ఇంటికి వెళ్లి భర్త ఏం చేశాడంటే ?!

మాజీ ప్రధాని నియోజక వర్గం జేడీఎస్ లీడర్

మాజీ ప్రధాని నియోజక వర్గం జేడీఎస్ లీడర్

భారత మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడకు హాసన్ పుట్టినిళ్లు లాంటిది. హాసన్ లో జేడీఎస్ హవా జోరుగానే ఉంటుంది. హాసన్ లోని శాంతినగర 16వ వార్డు కౌన్సిలర్ గా ప్రశాంత్ విజయం సాధించాడు. జేడీఎస్ పార్టీలో ప్రశాంత్ చాలా చరుకుగా ఉంటున్నాడు. లోకల్ గా పలుకుబడి సంపాధించుకోవాలని అనుకున్న ప్రశాంత్ అతని అనుచరులను వెంట వేసుకుని తిరుగుతున్నాడు.

రాజకీయ కక్షలు

రాజకీయ కక్షలు

ప్రస్తుతం ప్రశాంత్ కర్ణాటకలోప్రతిపక్ష పార్టీ అయిన జేడీఎస్ లో ఓ కౌల్సిలర్. రాజకీయ ప్రత్యర్థులు, పాతకక్షలు ఉండటంతో ప్రశాంత్ నగరం వదిలి బయటకు వెళ్లాలన్నా, ఏదైనా శుభకార్యాలకు వెళ్లాలన్నా వెంట అనుచరులను పెట్టుకుని వెలుతుంటాడు. ప్రతినిత్యం ఎంతో అలర్ట్ గా ఉంటున్న ప్రశాంత్ ను అంతం చెయ్యడం ప్రత్యర్థులకు ఇంతకాలం సాధ్యం కాలేదు.

అడ్డంగా నరికేసిన ప్రత్యర్థులు

అడ్డంగా నరికేసిన ప్రత్యర్థులు

పట్టపగలు తనను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని కొంచెం నిర్లంగా ప్రశాంత్ బైక్ మీద బయలుదేరాడు. బైక్ మీద వెలుతున్న కౌన్సిలర్ ప్రశాంత్ ను అతని ప్రత్యర్థులు అనుమానం రాకుండా ఆటోలో వెంబడించారు. ఆ సమయంలో జవనేహళ్ళి మఠం సమీపంలో అందరూ చూస్తున్న సమయంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో వేటకొడవళ్లు, కత్తులతో ప్రశాంత్ ను అతి దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.

గతంలో ప్రశాంత్ తండ్రి దారుణ హత్య

గతంలో ప్రశాంత్ తండ్రి దారుణ హత్య

జేడీఎస్ కౌన్సిలర్ ప్రశాంత్ తండ్రి నాగరాజ్ కూడా గతంలో జేడీఎస్ కౌన్సిలర్ గా పని చేశాడు. రాజకీయ కక్షల కారణంగా 2005లో ప్రశాంత్ తండ్రి నాగరాజ్ ను దారుణంగా నరికి చంపేశారు. తండ్రి హత్యకు గురికావడంతో ప్రశాంత్ రాజకీయాల్లోకి వచ్చాడు. నాగరాజ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ్మయ్య అనే వ్యక్తిని ప్రశాంత్ అతని అనుచరులు దారుణంగా నరికి చంపేశారు. తమ్మయ్య హత్యకు ప్రతీకారంగా ప్రశాంత్ ను చంపేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Revenge: JDS leader brutal murder in Hassan in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X