Sadist: ఫ్రెండ్ కొడుకును శాడిస్టు ఏం చేశాడంటే ?, ఉరిశిక్ష వేసిన కోర్టు, నిర్జనప్రదేశంలో ఏడాది అబ్బాయిని!
బెంగళూరు: స్నేహితుడి కొడుకును ఇంటికి పిలుచుకుని వెళ్లకుండా నిర్జన ప్రదేశంలోని ఎత్తుకుని వెళ్లిన కామాంధుడు ఆ బాలుడి మీద లైంగిక దాడి చేసి అసహజంగా సెక్స్ చెయ్యడానికి ప్రయత్నించాడు. బాలుడు కేకలు వెయ్యడంతో భయపడిన కామాంధుడు ఆ బాలుడి తల మీద పెద్ద సిమెంట్ రాయి వేసి దారుణంగా చంపేశాడు. బాలుడి శవం మీద పేపర్లు, చెత్త వేసి నిప్పంటించాడు. బాలుడిని కిరాతకంగా హత్య చేసిన కామాంధుడికి కోర్టు ఉరి శిక్ష విధించింది. ఐటీ హబ్ బెంగళూరులో ఈ దారుణం జరిగింది.

స్నేహితులు
బెంగళూరు నగరంలోని యశవంతపురం సమీపంలోని త్రివేణి రోడ్డులోని మురికివాడలో మూర్తి అలియాస్ హల్లుజ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మూర్తికి బాబు (పేరు మార్చడం జరిగింది) అనే స్నేహితుడు ఉన్నాడు. మూర్తి, బాబు ఎక్కువగా ఉల్లాస్ సినిమా థియేటర్ దగ్గర కలుసుకుని మాట్లాడుకునేవాళ్లు.

కొడుకును ఎత్తుకుని వెళ్లాడు
బాబుకు 12 నెలలు (సంవత్సరం) వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. 2015 సెప్టెంబర్ 12వ తేదీన బాబు అతని ఏడాది వయసు ఉన్న కొడుకును ఎత్తుకుని ఉల్లాస్ సినిమా థియేటర్ దగ్గరకు వెళ్లాడు. అప్పటికే అక్కడ మూర్తి ఉండటంతో అతనితో బాబు మాట్లాడుతున్నాడు. అందే సందర్బంలో బంధువు ఫోన్ చేసి అర్జెంట్ గా రావాలని బాలుడి తండ్రి బాబుకు చెప్పాడు.

స్నేహితుడిని నమ్మినందుకు?
తాను ఆసుపత్రి దగ్గరకు వెళ్లి బంధువులతో మాట్లాడి వస్తానని, నాకొడుకును మీ ఇంటిలో పెట్టుకోవాలని, రెండు గంటల తరువాత వచ్చి పిలుచుకుని వెలుతానని బాబు అతని స్నేహితుడు మూర్తికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మూర్తి బాలుడిని ఇంటికి పిలుచుకుని వెళ్లకుండా గురగుంటపాళ్యలోని ఎయిర్ ఫోర్స్ ఆవరణం సమీపంలోకి పిలుచుకుని వెళ్లాడు.

బాలుడి మీద లైంగిక దాడి చేసి దారుణ హత్య
బాలుడిని నిర్జన ప్రదేశంలోని ఎత్తుకుని వెళ్లిన కామాంధుడు మూర్తి ఆ బాలుడి మీద లైంగిక దాడి చేసి అసహజంగా సెక్స్ చెయ్యడానికి ప్రయత్నించాడు. బాలుడు కేకలు వెయ్యడంతో భయపడిన మూర్తి ఆ బాలుడి తల మీద 40 కేజీలు ఉన్న పెద్ద సిమెంట్ రాయి వేసి దారుణంగా చంపేశాడు. బాలుడి శవం మీద పేపర్లు, చెత్త వేసి నిప్పంటించిన మూర్తి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.

ఉరిశిక్ష విధించిన బెంగళూరు కోర్టు
బాలుడి తండ్రి బాబు కేసు పెట్టడంతో రాజగోపాలనగర పోలీసులు కేసు నమోదు చేసి మూర్తిని అరెస్టు చేశారు. బెంగళూరు 1వ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరిగింది. బాలుడి మీద లైంగిక దాడి చెయ్యడమే కాకుండా అతి దారుణంగా హత్య చేసిన మూర్తికి ఫోక్సో చట్టం సెక్షల కింద న్యాయమూర్తి కేఎస్. రూపా ఉరి శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించారు.

రూ. 5 లక్షల పరిహారం
బాలుడి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల పరిహారం అందించాలని బెంగళూరు జిల్లా న్యాయ శాఖ అధికారులకు కోర్టు సూచించింది. బాలుడితో అసహజంగా లైంగిక దాడి చేసి హత్య చేసిన కిరాతకుడికి ఉరి శిక్షపడటంతో మాకు న్యాయం జరిగిందని బాలుడి కుటుంబ సభ్యులు అంటున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications