కులం పేరుతో ?, హైకోర్టును ఆశ్రయించిన స్టార్ హీరో, అవసరమా నాయనా!

బెంగళూరు: కులం పేరుతో దూషించారని ఆరోపణల నేపథ్యంలో బహుబాష నటుడు, హీరో, దర్శకుడు ఉపేంద్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ హీరో ఉపేంద్ర కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఉపేంద్ర దరఖాస్తును విచారించిన కర్ణాటక హైకోర్టు ఎఫ్‌ఐఆర్‌పై మధ్యంతర స్టే విధించింది.

నటుడు ఉపేంద్రపై దాఖలైన కేసులు బదిలీ అయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. బెంగళూరు నగరంలోని హలసూరు గేట్ స్టేషన్‌లో నమోదైన కేసును బెంగళూరులోని చెన్నమ్మనకెరె స్టేషన్‌కు బదిలీ చేయాలని పోలీసు అధికారులు ఆలోచిస్తున్నారు. గతంలో చెన్నమనకెరె అచ్చుకట్టు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Star hero Upendra approached the Karnataka High Court to avoid the atrocity case

అందుకే ఎఫ్‌ఐఆర్‌ను హలాసూర్ గేట్ స్టేషన్ నుంచి అక్కడికి బదిలీ చేయాలని పోలీసు అధికారులు ఆలోచిస్తున్నారని తెలిసింది. బెంగళూరులోని వీవీపురం ఎసీపీ నాగరాజ్ చెన్నమ్మనకెరె పోలీస్ స్టేషన్ కేసులను విచారించనున్నారు. ఆగస్టు 13న ఏసీపీ నాగరాజ్ విచారణకు హాజరుకావాలని హీరో ఉపేంద్రకు నోటీసులు ఇచ్చారు. కానీ నటుడు ఉపేంద్ర విచారణకు హాజరుకాలేదు.

పోలీసుల విచారణకు హాజరుకాకుండా ఎవరి కంట పడకుండా తన లాయర్ ద్వారా హీరో ఉపేంద్ర కర్ణాటక హైకోర్టుకు వెళ్లారు. నటుడు ఉపేంద్ర పిటిషన్‌ను స్వీకరించిన కర్ణాటక హైకోర్టు సోమవారం ఎఫ్‌ఐఆర్‌పై స్టే విధించింది. నటుడు ఉపేంద్రపై పోలీసులు నిఘా వేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టలేదు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు నియమాలు పాటించాలని పోలీసులు నిర్ణయించారు.

కర్ణాటక హైకోర్టు ఆదేశాలను పరిశీలించిన తర్వాత విచారణ జరుపుతామని సీనియర్ అధికారులు కన్నడ మీడియాకు తెలిపారు. ప్రజాకీయ పార్టీ స్థాపించి 6 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు ఉపేంద్ర ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడారు. ఆ సమయంలో ఓ వివాదాదస్ప సామెత చెబుతూ ఆమన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఉపేంద్ర అభ్యంతరకర పదాలు వాడారని ఆరోపిస్తూ తీవ్ర దుమారం రేగింది.

హీరో ఉపేంద్ర వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసి సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పాడు. అయినా కొన్ని వర్గాలు, కులాలకు చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు సమీపంలోని రామనగరలో దళిత సంఘాలు ఉపేంద్ర దిష్టి బొమ్మలను దహనం చేసి నిరసనలు తెలిపాయి. హీరో ఉపేంద్ర అభ్యంతరకరమైన పదజాలం వాడడాన్ని ఖండించారు.

ఈ దెబ్బకు బెంగళూరు నగరంలోని చెన్నమ్మనకెరె అచ్చుకట్టు, హలసూర్ గేట్ పోలీస్ స్టేషన్లలో హీరో ఉపేంద్ర మీద అట్రాసిటీ కేసు నమోదైంది. కర్ణాటక మంత్రి హెచ్. సి మహదేవప్ప కూడా ఉపేంద్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు ఉపేంద్ర వ్యాఖ్యలకు అండగా నిలిచారు.

హీరో ఉపేంద్ర ఆయనకు తెలియకుండానే ఆ సామెతతో మాట్లాడరని, ఆ తర్వాత దానికి క్షమాపణలు కూడా చెప్పాడు. అది అక్కడతో ఆగిపోవాలని హీరో ఉపేంద్రకు మద్దతుగా నిలుస్తాం అని చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఎవ్వరికి కనపడకుండా మాయం అయిన హీరో ఉపేంద్ర తరువాత ఏం చేస్తారు ?, ఆయనకు మద్దతుగా ఎవరు నిలుస్తారు ?, ఏ పార్టీ ఉపేంద్రకు అండగా ఉంటుందని అని వేచి చూడాలని కన్నడిగులు అంటున్నారు. అయితే ఉపేంద్ర ఫ్యాన్స్ మాత్రం ఇదెక్కడి రామయణం అంటూ కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+