target: అమిత్ షా కొడుక్కి క్రికెట్ గురించి ఏం తెలుసు, బీసీసీఐలో ఎందుకు ?, మా పిల్లలు రాజకీయాల్లోకి?
బెంగళూరు/కోప్పళ: డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవుతారని, జడ్జీల పిల్లలు జడ్జీలు అవుతారని, ఐఎస్ఎస్ అధికారుల పిల్లలు ఐఏఎస్ అవుతున్నారని, ఐపీఎస్ అధికారుల పిల్లలు పోలీసు అధికారులు అవున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి అన్నారు. అయితే రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి వస్తే ఎందుకు అంత రాద్దాంతం చేస్తున్నారు ? అని కుమారస్వామి ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రశ్నించారు.
ఇదే సమయంలో కుమారస్వామి కుటుంబ రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పారు. మా కుటుంబంలోని పిల్లలు రాజకీయాల్లోకి రాకూడాదా ?, రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు చెయ్యడానికి అవకాశం లేదా ? అని మాజీ సీఎం కుమారస్వామి కాంగ్రెస్, బీజేపీ నేతలను ప్రశ్నించారు.

ఫ్యామిలీ రాజకీయాలు
కర్ణాటకలోని కుష్టగిలో మాజీ సీఎం కుమారస్వామి విలేకరులతో మాట్లాడారు. కుటుంబంలో పెద్దలు చేసే పనులు వారి పిల్లలు చేస్తే తప్పా, పిల్లలు ఏం చేయాలో నిర్ణయించుకునే హక్కు వారికి రాజ్యాంగం కల్పించిందని కుమార్వామి గుర్తు చేశారు. మా కోరిక మేరకు మా కుటుంబ సభ్యులు హాసన్‌లో టికెట్ కోసం ఆశపడటం తప్పు ఎలా అవుతుందని కుమారస్వామి కొందరిని ప్రశ్నించారు.

అమిత్ షాను టార్గెట్ చేసిన కుమారస్వామి
జేడీ(ఎస్) కుటుంబ రాజకీయాలు చేస్తోందని గతంలో అమిత్ షా ఆరోపించారు. ఇదే విషయంలో హెచ్ డీ. కుమారస్వామి ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఏ పార్టీలో కుటుంబ రాజకీయాలు లేవు అని బహిరంగంగా చెప్పండి అంటూ బీజేపీ నాయకుల మీద కుమారస్వామి మండిపడ్డారు. బీజేపీలో కుటుంబ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని, అంత ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కుటుంబ రాజకీయాలు లేవా, జేడీఎస్ లో మాత్రమే కుటుంబ రాజకీయాలు ఉన్నాయా అని కుమారస్వామి ఆ రెండు పార్టీల నేతలను ప్రశ్నించారు.

అమిత్ షా కొడుక్కి క్రికెట్ గురించి ఏం తెలుసు?
జేడీఎస్ పార్టీ నేతల గురించి మాట్లాడే నైతికత హక్కు కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాకు లేదని, అమిత్ షా ఏ ప్రాతిపాదికన తన కొడుకును బీసీసీఐలో అత్యున్నత పదవికి నియమించారో అందరికి బాగా తెలుసని కుమారస్వామి మండిపడ్డారు. అసలు అమిత్ షా కుమారుడికి క్రికెట్ గురించి ఏం అనుభవం ఉందని మాజీ సీఎం కుమారస్వామి బీజేపీ నాయకులను ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అమిత్ సా ఆయన కుమారుడిని బీసీసీఐలో కీలకపదవిలో నియమించారని కుమారస్వామి ఆరోపించారు.

మాకు ఓటు వెయ్యకూడదని చెప్పడానికి మీరు ఎవరు?
బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు జేడీఎస్‌కు ఓటు వేయకూడదని ప్రజలకు ఎలా చెబుతారు అని కుమారస్వామి మండిపడ్డారు. ప్రజలు ఎవరికి ఓటు వేయ్యాలో మీరే చెబుతుతున్నారు. అదే సమయంలో నన్ను ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారని కుమారస్వామి కాంగ్రెస్, బీజేపీ నాయకులను కుమారస్వామి నిలదీశారు. పాత మైసూర్ ప్రాంతంలో జేడీఎస్ బలంగా ఉందని, అక్కడ మమ్మల్ని ఎంత టార్గెట్ చేసినా మీరు మమ్మల్ని ఏమీ చేయలేమని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు.

ఉత్తర కర్ణాటకలో ఊపేస్తాము
ఈసారి పంచరత్న యాత్ర కారణంగా ఉత్తర కర్ణాటకలో జేడీఎస్ కు ప్రజలు ఊహించని మద్దతు ప్రకటించారని, త్వరలో జరగబోచే శాసన సభ ఉన్నికల్లో ఈ ప్రాంతంలో దాదాపు 40 నుంచి 50 ఎమ్మెల్యేల సీట్లు గెలుచుకుంటామని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. కుష్టగిలో ఇంత పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుందని ఎవరైనా అనుకున్నారా? దావరగెరాలో జేడీఎస్ లో అంత పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు చేరుతారని తాను ఏమాత్రం ఉహించలేదని కుమారస్వామి అన్నారు.
ఉత్తర కర్ణాటక ప్రాంతంలో మాకు ఊహించని మద్దతు లభిస్తోందని, ఈ విషయాన్ని కాంగ్రెస్ బీజేపీ నేతలు గుర్తిస్తే వారికే మంచిదని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి వ్యంగంగా అన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications