Karnataka: ముస్లిం రిజర్వేషన్ల ఉపసంహరణ తాత్కలికంగా నిలిపివేత..
ఏప్రిల్ 18న సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరిగే వరకు 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల ఉపసంహరణను అమలు చేయబోమని కర్ణాటక ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ముస్లింలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్లు ఎత్తివేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను న్యాయమూర్తులు కెఎమ్ జోసెఫ్, బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 18 వాయిదా వేసింది.

కొత్త రిజర్వేషన్ విధానం ఆధారంగా ఎలాంటి అడ్మిషన్ లేదా నియామకాలను కొనసాగించవద్దని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం కేటాయింపులను తొలగించి, రాష్ట్ర రిజర్వేషన్ కోటాలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. ముస్లింలకు 4 శాతం ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వారు ఇప్పుడు 10 శాతం ఆర్థికంగా బలహీనమైన విభాగం (EWS) కేటగిరీకి మార్చింది. దీంతో ముస్లింలు ఇప్పుడు బ్రాహ్మణులు, వైశ్యులు, ముదలియార్లు, జైనులు, ఇతరులు ఉన్న EWS కోటాతో పోటీ పడవలసి ఉంటుంది. గత ఏడాది బెలగావి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 2సి, 2డి అనే రెండు కొత్త రిజర్వేషన్ కేటగిరీలు సృష్టించిన ముస్లింల 4 శాతం కోటాను ఇప్పుడు వొక్కలిగస్ (2 శాతం), లింగాయత్‌లకు (2 శాతం) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications