గత ప్రభుత్వ అక్రమాలపై రిటైడ్ జడ్జ్ తో విచారణ జరిపిస్తున్న సిట్టింగ్ సీఎం, సీన్ సిడేల్!

బెంగళూరు: కర్ణాకలో సంచలనం రేపిన 545 మంది ఎస్‌ఐల అక్రమ రిక్రూట్‌మెంట్ కేసుపై ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమ రిక్రూట్‌మెంట్ కేసు విచారణను ఇప్పుడు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ విచారణకు అప్పగించడం కలకలం రేపింది.

గత బీజేపీ ప్రభుత్వ హయాంలో వెలుగు చూసిన 545 ఎస్ఐ రిక్రూట్‌మెంట్ పరీక్షల అవకతవకలపై దర్యాప్తు చేసేందుకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బి. వీరప్ప నేతృత్వంలో ఏక సభ్య విచారణ కమిషన్‌ను నియమిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 545 ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ రాత పరీక్ష అవకతవకల కేసుపై విచారణ పూర్తి చేసి 3 నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

The Siddaramaiah government is investigating the case of illegal recruitment of SI posts with a retired judge

బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అప్పటి బీజేపీ ప్రభుత్వంపై, అప్పటి హోమ్ మంత్రి ఆరగ జ్ఞానేంద్రపై కాంగ్రెస్ పెద్దఎత్తున విమర్శలు చెయ్యడంతో పాటు ఆందోళనలు నిర్వహించింది. ఈ అక్రమాలపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ మొదటి నుంచి చెబుతోంది.

తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఐ ఉద్యోగాల అక్రమ నియమకాన్ని హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో న్యాయ విచారణ చేయించాలని నిర్ణయించింది. ఇప్పుడు రిటైడ్ జడ్జ్ తో ఎస్ఐ ఉద్యోగాల అక్రమ నియమాల స్కామ్ గురించి న్యాయ విచారణకు అప్పగించింది.

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 545 పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్) ఖాళీలను భర్తీ చేయడానికి జనవరి 21, 2021వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయబడింది. రాత పరీక్ష అక్టోబర్ 3, 2021న కర్ణాటకలోని మొత్తం జిల్లాల్లోని 92 కేంద్రాలలో నిర్వహించారు. ఈ రాత పరీక్షల్లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం సీఐడీ విచారణ చేపట్టింది.

The Siddaramaiah government is investigating the case of illegal recruitment of SI posts with a retired judge

రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో తాత్కాలిక ఎంపిక జాబితాలో 52 మంది అభ్యర్థులతో సహా ఇతర నిందితులపై క్రిమినల్ కేసులు నమోదైనాయి. సంబంధిత కోర్టుల్లో ఛార్జిషీటు దాఖలు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. జూన్ 20, 2023న పోలీసు శాఖ నిర్వహించిన అన్ని కేడర్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌లో 52 మంది అభ్యర్థులు చట్టవిరుద్ధంగా పరీక్ష రాసినట్లు నిర్ధారించారు.

ఇదే కేసులో ఓ డీజీపీని ఉద్యోగం నుంచి తప్పించారు. 545 పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వెలుగు చూసింది. పోలీసు శాఖలో అక్రమ నియామకాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. పోలీసు నియామకాలు చాలా పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందని కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం అంటోంది.

కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, 1952లోని సబ్-రూల్ 3 ప్రకారం న్యాయ విచారణ జరిపేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయ విచారణను ఏర్పాటు చేయాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. విచారణ కమిషన్ 545 మంది ఎస్ఐల ఎంపిక ప్రక్రియలో రిక్రూట్‌మెంట్ నియమకాలు ఉల్లంఘించబడిందా? లేదా ? అన్నది విచారణ చేయాలి. ఎంపిక ప్రక్రియలో రిక్రూట్‌మెంట్ నియమాలు ఉల్లంఘించబడ్డాయా ? లేదా అని విచారణ చేయాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+