Water fight: పక్క రాష్ట్రం సీఎంకు, ఆ లీడర్లకు ఏం పనిపాటా లేదు, ఎప్పుడూ నీళ్ల పంచాతీనే, సీఎం !

బెంగళూరు/మైసూరు: ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రాజకీయాలు చేస్తే ఇబ్బంది ఉండదని, రాజకీయాల కోసమే ప్రజలకు సమస్యలు తెచ్చి పెట్టడం మంచిది కాదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. పొరుగు రాష్ట్రంలోని రాజకీయ నాయకుల మీద తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసిన బసవరాజ్ బోమ్మయ్ ఇంకా ఎన్ని సంవత్సరాలు నీటి పంపిణి విషయంలో రాజకీయాలు చేస్తారు ? అంటూ పక్క రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని, అక్కడి రాజకీయ నాయకులను ప్రశ్నించారు. మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎంత వరకు అయినా పోరాడతామని, అందులో ఎలాంటి డౌట్ లేదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ పొరుగు రాష్ట్రంలోని రాజకీయ నాయకులకు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి విడత మంత్రి వర్గం ఏర్పాటు చేసుకున్న బసవరాజ్ బోమ్మయ్ ఆయన మార్కు పరిపాలన సాగించడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.

తమిళనాడు రాజకీయాలకు ‘కావేరి’వరం

తమిళనాడు రాజకీయాలకు ‘కావేరి’వరం

కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మద్య కావేరీ నీరు పంపిణి విషయంలో దశాభ్దాల కాలం నుంచి రామాయణం జరుగుతూనే ఉంది. కావేరీ నీటి సమస్య ముందు పెట్టుకుని నువ్వా ?, నేనా ? అంటూ తమిళనాడులోని రాజకీయా పార్టీ ఎన్నికల్లో ఇంతకాలం లబ్ది పోందాయనే విషయం రెండు రాష్ట్రాల ప్రజలకు, రాజకీయాలు గురించి తెలిసిన వాళ్లకు కొత్తగా చెప్పనవసరం లేదు.

మేకదాటు ప్రాజెక్టు పంచాయితి

మేకదాటు ప్రాజెక్టు పంచాయితి

ఇప్పుడు మళ్లీ కావేరీ నీటి పంపిణి విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మద్య పంచాయితీలు జరుగుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం కొత్తగా మేకదాటు ప్రాజెక్టు నిర్మించడానికి సిద్దం అయ్యింది. మేకదాటు ప్రాజెక్టు నిర్మిస్తే తమిళనాడులోని రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆ రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

వీళ్లది ఎప్పుడు చూసినా ఇదే రామయణం

వీళ్లది ఎప్పుడు చూసినా ఇదే రామయణం

ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రాజకీయాలు చేస్తే ఇబ్బంది ఉండదని, రాజకీయాల కోసమే ప్రజలకు సమస్యలు తెచ్చి పెట్టడం మంచిది కాదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. తమిళనాడు రాజకీయ నాయకులు వారి లబ్ది కోసం కావేరీ నీటి పంపిణి విషయాన్ని తెరమీదకు తీసుకు వచ్చి కాలం గడిపేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. సోమవారం మైసూరులో కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా చేస్తారు ?

ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా చేస్తారు ?

ఇంకా ఎన్ని సంవత్సరాలు కావేరీ నీటి పంపిణి విషయంలో రాజకీయాలు చేస్తారు ? అంటూ పక్క రాష్ట్రం తమిళనాడులోని ప్రభుత్వాన్ని, అక్కడి రాజకీయ నాయకుల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులోని రాజకీయ నాయకుల మీద తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసిన బసవరాజ్ బోమ్మయ్ మేకదాటు ప్రాజెక్టు విషయంలో మేము వెనక్కి తగ్గమని తేల్చి చెప్పారు.

బెంగళూరు ప్రజలకు తాగునీరు వద్దా ?

బెంగళూరు ప్రజలకు తాగునీరు వద్దా ?

మేకదాటు ప్రాజెక్టు నిర్మించి అక్కడి నుంచి బెంగళూరులో నివాసం ఉంటున్న ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చడానికి ప్రయత్నిస్తామని కర్ణాటక ప్రభుత్వం అంటోంది. మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎంత వరకు అయినా పోరాడతామని, అందులో ఎలాంటి డౌట్ లేదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ పొరుగు రాష్ట్ర ప్రభుత్వానికి, తమిళనాడులోని రాజకీయా నాయకులకు తేల్చి చెప్పారు.

ఢిల్లీ వెళ్లి తేల్చుకుంటాము

ఢిల్లీ వెళ్లి తేల్చుకుంటాము

మేకదాటు ప్రాజెక్టు విషయంలో మరోసారి ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి విడత మంత్రి వర్గం ఏర్పాటు చేసుకున్న బసవరాజ్ బోమ్మయ్ ఆయన మార్కు పరిపాలన సాగించడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+