నీళ్ల కోసం రైతులు పోరాడుతుంటే మీరు ఏం చేస్తున్నారు ?, ప్రభుత్వానికి సూటి ప్రశ్న!
బెంగళూరు: తమిళనాడుకు కావేరి నీరు అందజేసే విషయంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బీజేపీ ప్రశ్నించింది. కావేరి నీరు నిలువరించడానికి రైతులు సుప్రీం కోర్టుకు వెలుతుంటే మీరు ఏం చేస్తున్నారని, మీకు ప్రజలు అధికారం ఎందుకు ఇచ్చారని, మీరు అధికారంలో ఉండి ఏం చేస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ ను మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ప్రశ్నించారు.
గురువారం బెంగళూరులో మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ తమిళనాడుకు కావేరి నీరు పంపిణీ విషయం గురించి మాట్లాడారు. మన రాష్ట్రానికి కావేరి నీటి మీద హక్కు ఉంది, నీరు సేకరించిన డ్యామ్ మన రాష్ట్రంలోనే ఉంది. అయితే మన హక్కులను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నీటిని తమిళనాడుకు విడిచిపెడుతుందని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మండిపడ్డారు.

కేఆర్ఎస్ డ్యామ్‌లు మన రాష్ట్రంలోనే ఉందనే సమాచారం కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసా, తెలీదా ? అని అర్థం కావడం లేదని, మన హక్కులను పట్టించుకోకుండా తమిళనాడుకు నీరు వదిలేస్తున్నారని రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎదురైయ్యిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ విచారం వ్యక్తం చేశారు.
కావేరి నీటి కోసం రైతులు సుప్రీం కోర్టుకు వెళ్లాలని మీరు అంటున్నారని, అయితే మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలని, ఈ ప్రభుత్వంలో ఎందుకు అధికారంలో ఉండాలని, కావేరి నీరు కావాలని కోరుకుంటున్న ప్రజలు ఉంటున్న ప్రాంతంలో మీ పార్టీ నాయకులను ఎమ్మెల్యేలు చేశారు. ఇంత చేసినా మీరు అక్కడి ప్రజలకు కావేరి నీరును అందించలేరా అంటూ మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని మీరు ప్రయత్నిస్తే మేము రైతుల పక్షాన నిలపబడి పోరాటం చేస్తామని, కావేరి నీటిని కాపాడుకోవడానికి మేము ఎంత వరకు అయినా పోరాటం చెయ్యడానికి సిద్దంగా ఉన్నామని, బీజేపీ రైతుల పక్షాన ఉంటుందని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కావేరి నీటి కోసం ప్రజలు పోరాటం చెయ్యాల్సి ఉస్తుందని, అలాంటి ఖర్మ మనకు పట్టిందని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ సిద్దరామయ్య ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications