యడియూరప్పకు గవర్నర్ పదవి ? క్లారిటీ ఇచ్చిన కర్నాటక మాజీ సీఎం- కీలక వ్యాఖ్యలు
కర్నాటక ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేశారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను రాజ్ భవన్ లో కలిసిన ఆయన రాజీనామా పత్రాన్ని అందజేశారు. దీంతో గవర్నర్ యడియూరప్పను కొత్త ముఖ్యమంత్రి ఎన్నికయ్యే వరకూ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు. దీంతో కర్నాటకలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది.
మరోవైపు కర్నాటక ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్న యడియూరప్పకు బీజేపీ అధిష్టానం గవర్నర్ పదవి ఆశచూపినట్లు తెలుస్తోంది. ఏపీ లేదా మరో రాష్ట్రానికి గవర్నర్ గా యడియూరప్పను నియమించే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై యడియూరప్ప స్వయంగా స్పందించారు తనకు గవర్నర్ పదవి ఇవ్వబోతున్నారన్న వార్తలపై స్పందించిన యడియూరప్ప.. తాను ఎక్కడికీ వెళ్లనని, రాష్ట్రంలోనే ఉంటానని స్పష్టం చేశారు.

Recommended Video
తన రాజీనామాపై హైకమాండ్ నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదని యడియూరప్ప తెలిపారు. అధిష్టానం తనను రాజీనామా చేయమని కోరలేదని, తాను స్వచ్ఛందంగానే తప్పుకున్నట్లు ఆయన వెల్లడించారు. తన వారసుడిగా ఎవరి పేరూ సూచించలేదని, అధిష్టానం ఎవరిని నియమించినా కలిసి పనిచేస్తానని యడియూరప్ప పేర్కొన్నారు. తాను ఎలాంటి పదవులూ కోరుకోవడం లేదని, గవర్నర్ గా వెళ్లడం ఇష్టం లేదని కూడా తెలిపారు. తాను కర్నాటక వదిలి ఎక్కడికీ వెళ్లబోనని, రాబోయే ఎన్నికల్లో బీజేపీని మరోసారి గెలిపించేందుకు ప్రయత్నిస్తానన్నారు.












Click it and Unblock the Notifications