• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిగ్‌బాస్‌పై బిగ్ బాంబ్: కంటెస్టెంట్ల మధ్య కాంప్రమైజింగ్: మాజీల హాట్ కామెంట్స్: పస లేదంటూ

|

ముంబై: బిగ్‌బాస్‌పై బిగ్ బాంబులు పడుతున్నాయి. ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా తొలిసారిగా బిగ్‌బాస్ ఎపిసోడ్స్‌పై వీక్షకుల్లో అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. సాధారణంగా ఎలిమినేషన్‌కు గురైన కంటెస్టెంట్ ద్వారా హౌస్‌మేట్స్‌పై బిగ్ బాంబులను వేయించే బిగ్‌బాస్‌పై రివర్స్ గేర్‌లో బిగ్ బాంబులు పడుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య పెట్టే టాస్క్, అందులో వారు పాల్గొనే తీరు, విధానం.. నచ్చట్లేదనే అభిప్రాయాలు వీక్షకుల్లో నెలకొంటోంది. దాన్ని బహిరంగంగా వెల్లడిస్తున్నారు.. సోషల్ మీడియా ద్వారా. ఎపిసోడ్స్‌ను చూడాలనే కాంక్ష తగ్గుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.

సల్లూభాయ్ హోస్ట్‌గా ఉన్నా..

దేశానికి బిగ్‌బాస్‌ రియాలిటీ షోను పరిచయం చేసింది ముంబై. 13 సీజన్లను విజయవంతంగా ముగించుకుంది. 14వ సీజన్‌లోకి అడుగు పెట్టింది. దీనికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నారు. ఇదివరకు ముగిసిన సీజన్‌తో తాజా ఎపిసోడ్స్‌ను కంపేర్ చేసి చూస్తున్నారు వీక్షకులు. ఏదో తేడా కొడుతోందని బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకుముందులా వీక్షకులను టీవీలకు అతుక్కు పోయేలా చేసే ఫ్రెష్‌నెస్ లోపించిందని అంటున్నారు.

వీకెండ్ కా వార్.. పేరులో ఫైర్ ఉన్నా..

ఈ తరహా కామెంట్స్ చేస్తోన్న వారిలో ఇద్దరు మాజీ కంటెస్టెంట్స ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు కామ్యా పంజాబీ, ప్రియా మలిక్ సైతం ఈ లిస్టులో ఉన్నారు. రాన్రాను బిగ్‌బాస్ పరమ బోరింగ్‌గా మారుతోందని బాహటంగానే హాట్ కామెంట్స్ చేశారు. కంటెస్టెంట్ల మధ్య రాజీ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే ఫైర్ లేకుండా పోయిందని చెబుతున్నారు. కంటెస్టెంట్లు చాలా విషయాల్లో కాంప్రమైజింగ్‌గా కనిపిస్తున్నారని, అది బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోలకు ఏ మాత్రం మంచిదికాదని అభిప్రాయపడుతున్నారు.

గతమెంతో ఘనం..

`కంటెస్టెంట్లందరూ పరమ బోరింగ్‌గా కనిపిస్తున్నారు. ప్లీజ్.. ఏమైనా చేయండి.. అంటూ కామ్యా పంజాబీ.. కలర్స్ టీవీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఒకే అంశంపై కంటెస్టెంట్ల మధ్య నెలకొనే డ్రామాను చూడలేకపోతున్నామంటూ చెప్పుకొచ్చారు. ఎంటర్‌టైన్‌మెంట్ లోపించిందని తేల్చి పారేశారు. నిక్కీ థంబోలి, జాస్మిన్ భాసిన్, షెహజాద్ డియోల్, నిషాంత్ సింగ్ మల్ఖానీ, రాహుల్ వైద్య, అభినవ్ శుక్లా వంటి కంటెస్టెంట్లు తమ శక్తి సామర్థ్యాలకు తగ్గట్లుగా ప్రవర్తించట్లేదని అభిప్రాయపడ్డారు. ఇదివరకటి బిగ్‌బాస్ సీజన్లతో పోల్చి చూస్తే.. ఈ సారి ఎపిసోడ్స్ చప్పగా సాగుతున్నాయని, పస ఉండట్లదేని అన్నారు. గతమెంతో ఘనం అని చెబుతున్నారు.

  Bollywood Controversy : ఆ ఛానెళ్ల ని కోర్టుకి ఈడ్చిన హీరోలు,నిర్మాతలు | RGV ట్వీట్!!

  కొందరు కంటెస్టెంట్లు..

  ఇప్పటిదాకా సాగిన బిగ్‌బాస్ సీజన్-14 ఎపిసోడ్స్ మొత్తం నిక్కీ థంబోలి, సిద్ధార్థ్ శుక్లాల షోగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొందరు కంటెస్టెంట్లు అసలు కనిపించట్లేదని, వారు ఉన్నారా? లేదా? అనే అనుమానాలు నెలకొంటున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. షెఫాలి జరివాలా తరచూ మెరుపులు మెరిపిస్తున్నప్పటికీ.. అది స్థిరంగా కొనసాగట్లేదని అంటున్నారు. మొత్తానికి సీజన్-14ను మరింత ఆసక్తికరంగా మార్చడంపై నిర్వాహకులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తేల్చి చెబుతున్నారు.

  English summary
  former Bigg Boss contestants Kamya Punjabi and Priya Malik feel that the freshers in BB 14 are 'boring.' The two beauties have stayed in the BB house previously and understand the dynamics.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X