Bigg Boss Telugu: మోనాల్‌ను కొనసాగించడంపై మతలబేంటీ? అందుకోసమేనా? హౌస్‌లో ఏం జరుగుతోంది?

హైదరాబాద్: బిగ్‌బాస్ తెలుగు సీజన్-4పై అనుమానాలు కమ్ముకుంటున్నాయి. ఎలిమనేషన్ల ప్రక్రియ తేడా కొడుతోందనే ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి. వ్యూవర్స్ అభిప్రాయాలు, వారి ఓటింగ్‌కు వ్యతిరేకంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్.. హౌస్‌లో కొనసాగుతున్నారంటూ అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. వీకెండ్ వచ్చేసరికి.. అవి కాస్తా తీవ్రరూపం దాల్చుతున్నాయి. కంటెస్టెంట్ ఎలిమినేషన్‌ ప్రక్రియను ఆధారంగా చేసుకుని నెటిజన్లు తమ విమర్శలకు పదును పెడుతున్నారు. నెటిజన్ల వ్యాఖ్యలు.. వారి విమర్శల నేపథ్యంలో.. బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరుగుతోందనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

మోనాల్‌ను కొనసాగించడంపై..

మోనాల్‌ను కొనసాగించడంపై..

ప్రత్యేకించి- బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో ఒకరైన మోనాల్ గజ్జర్‌ను హౌస్‌లో కొనసాగించడం పట్ల మేకర్స్ తప్పిదాలు చేస్తున్నారనే వాదనలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌‌లల్లో ఆమె అందరితో పోటీ పడలేకపోయినప్పటికీ.. వీక్షకుల అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ.. ఆమెను కొనసాగించడం వెనుక ఏదో మతలబు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. హౌస్‌లో గ్లామర్ డోస్ పెంచాలనే ఉద్దేశంతోనే ఆమెను కంటిన్యూ చేయిస్తున్నారనేది మెజారిటీ నెటిజన్ల అభిప్రాయం.

టీఆర్పీ పడిపోతోందా?

టీఆర్పీ పడిపోతోందా?

బిగ్‌బాస్ తెలుగు సీజన్-4లో నిర్వాహకులు ఆశించిన స్థాయిలో టీఆర్పీని అందుకోలేకపోతున్నారనే వార్తలు ఉన్నాయి. దీనిపై ఓ ఆంగ్ల వెబ్‌సైట్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇదివరకటి సీజన్లతో పోల్చుకుంటే.. ఈ సారి అంచనాలు తప్పాయని, కంటెస్టెంట్ల సెలక్షన్‌లోనే నిర్వాహకులు పొరపాటు చేశారని పేర్కొంది. గ్లామర్ డోస్‌ను పెంచడానికి ప్రస్తుతం కంటెస్టెంట్లలో మోనాల్ ఒక్కరే ఉన్నారని, వీక్షకుల ఓటింగ్‌కు అనుగుణంగా ఆమెను బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేయాల్సిన పరిస్థితి వస్తే.. టీఆర్పీ మరింత తగ్గుతుందనే కారణంతో కొనసాగిస్తున్నారని ఆ వెబ్‌సైట్ తన కథనంలో పొందుపరిచింది.

పోటీ తీవ్రం..

పోటీ తీవ్రం..

బిగ్‌బాస్ ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 మ్యాచ్‌లు ప్రసారం అవుతున్నాయి. బిగ్‌బాస్ ఎపిసోడ్లకు అత్యధిక వ్యూవర్‌షిప్ లభించేది వీకెండ్ డేస్‌లోనే. శని, ఆదివారాల్లో హోస్ట్ అక్కినేని నాగార్జున డయాస్ మీదికి రావడం, ఎలిమినేషన్ ప్రక్రియ ఉండటం వల్ల వీక్షకుల్లో బిగ్‌బాస్ ఎపిసోడ్లను చూడాలనే ఆసక్తి కలుగుుతంది. అదే- శని, ఆదివారాల్లో ఐపీఎల్-2020 మ్యాచ్‌లు రెండు ఉంటాయి. ఫలితంగా- ఎక్కువ మంది మ్యాచ్‌లను చూడటం వైపు మొగ్గు చూపుతారనే అభిప్రాయం ఉంది. ఐపీఎల్-2020తో క్లాష్ కావాల్సి రావడం వల్ల ఆశించిన స్థాయిలో టీఆర్పీ రావట్లదని చెబుతున్నారు.

కుమార్ సాయిని బలి చేశారా?

కుమార్ సాయిని బలి చేశారా?

మోనాల్ గజ్జర్‌తో కంపేర్ చేస్తే.. టాలీవుడ్ నటుడు కుమార్ సాయిని బలి చేశారనే వాదనలు సోషల్ మీడియాలో వెల్లువెతుతున్నాయి. కుమార్ సాయికి బదులుగా మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. మేకర్స్ ఆమెను సేవ్ చేశారని, కుమార్ సాయిని హౌస్ నుంచి బయటికి సాగనంపారని అంటున్నారు. ఈ విషయంలో నిర్వాహకులు ఓ తెలుగు యువ నటుడికి అన్యాయం చేశారనే ఆరోపణలు నెటిజన్ల నుంచి వ్యక్తమౌతున్నట్లు ఆ ఆంగ్ల వెబ్‌సైట్ తన కథనంలో రాసుకొచ్చింది. మోనాల్ గజ్జర్, మెహబూబ్, అమ్మ రాజశేఖర్ మోస్ట్ డిస్‌లైక్ కంటెస్టెంట్లుగా పేరు తెచ్చుకున్నారని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+