వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

40 ఏళ్ళుగా ఎలుకలే ఆహరం: తండ్రితో పాటు అడవికి, చెట్టుపైనే కాపురం, వియత్నాం టార్జాన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

వియత్నాం: వియత్నాంలోని దట్టమైన అడవిలో హో వాన్ లాంగ్ అనే వ్యక్తి 40 ఏళ్ళుగా జీవనం సాగిస్తున్నాడు. ఎలుకలే ఆయన ఆహరం. సినిమాలో చూపించినట్టుగా టార్జాన్ తరహలోనే ఆయన తన జీవితాన్ని గడిపిస్తున్నారు.

40 ఏళ్ళుగా అడవిలోనే జీవనాన్ని గడుపుతున్నాడు. అయితే తండ్రితో కలిసి అడవికి వచ్చిన హౌ వాన్ లాంగ్ అక్కడే జీవనాన్ని గడుపుతున్నాడు. అయితే దట్టమైన అడవి కావడంతో ఈ ప్రాంతానికి వెళ్ళేందుకు ఎవరూ సాహసించరు.

అయితే దట్టమైన అడవి ప్రాంతంలో జంతువులతో పాటు హౌ వాన్ లాంగ్ అనే వ్యక్తి జీవనం గడుపుతున్న విషయం 2013 లో వెలుగు చూసింది. దీంతో ఆయన జీవన శైలి విభిన్నంగా ఉన్న విషయం వెలుగు చూసింది.

 ఎలుకలే జీవనాధారం

ఎలుకలే జీవనాధారం

వియత్నాంలోని అడవులను ఆవాసంగా చేసుకున్న రియల్ లైఫ్ టార్జన్ ఉదంతం మరోమారు చర్చల్లోకి వచ్చింది. హో వాన్ లాంగ్ తాను అడవిలో కేవలం ఎలుకలనే తింటూ జీవనం సాగించే విషయాన్ని ప్రపంచానికి చూపాడు. 44 ఏళ్ళుగా ఎలుకలే ఆయనకు భోజనం. ఎలుకలు తినందే ఆయన జీవనం గడవదు.

 తండ్రితో పాటు అడవికి

తండ్రితో పాటు అడవికి

ఒకప్పటి వియత్నాం యుద్ధం సమయంలో తండ్రితోపాటు ఇంటి నుంచి పారిపోయిన అతను సుమారు 41 సంవత్సరాల పాటు టె‌ట్రా డిస్ట్రిక్ అడవుల్లో తలదాచుకున్నాడు.హో వాన్ లాంగ్ తండ్రి ఆర్మీలో పనిచేసేవాడు. ఆయనతో పాటే .హో వాన్ లాంగ్ అడవికి చేరుకొన్నాడు.అప్పటి నుండి ఆయన అడవిలోనే ఉంటున్నాడు.

 ట్రీ హౌజ్‌లో తల దాచుకొన్న హో వాన్ లాంగ్

ట్రీ హౌజ్‌లో తల దాచుకొన్న హో వాన్ లాంగ్

తండ్రితో పాటు అడవికి వచ్చిన హో వాన్ లాంగ్ అక్కడే జీవనం సాగిస్తున్నాడు. అడవిలో ఒక్కడే బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాడు. టార్జన్ మాదిరిగా ట్రీ హౌస్‌లో నివసించసాగాడు.

 అడవులకు సమీపంలో ఇల్లు నిర్మాణం

అడవులకు సమీపంలో ఇల్లు నిర్మాణం

అయితే ఈ ఉదంతం తొలిసారిగా 2013లో వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి అతను బయటి ప్రపంచంలోకి వచ్చే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. అడవులకు సమీపంలోని ఒక ఇంటిలో ఉంటున్నాడు. తన కుమారుడు ఇప్పడిప్పుడే సాదారణ స్థితిలోకి వస్తున్నాడని తండ్రి ఇటీవల తెలిపారు.

English summary
A VIETNAMESE man has opened up on how he managed to live off huge rats after fleeing the horrors Vietnam War to become a real life Tarzan.In an extraordinary video Ho Van Lang, 44,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X