వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ 4ఏళ్ల పాలన: జన్ ధన్ యోజన కింద 31.56 కోట్లకు పైగా ఖాతాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద ఇప్పటి వరకు 31.56 కోట్లకు పైగా ఖాతాలు తెరిచినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చిన హామీలు, నెరవేర్చిన హామీలు, ఏం సాధించారు, ఏం చేయాల్సి ఉంది అనే అంశాలపై చర్చ సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ జన్ ధన్ యోజన వివరాలను వెల్లడించింది. మోడీ నాలుగేళ్ల పాలనలో సాధించిన ఘనత ఇది అని ఆర్థిక శాఖ ట్వీట్‌ చేసింది. మొత్తం జన్‌ ధన్‌ ఖాతాల్లో గ్రామీణ ప్రాంతాల్లోనే 59 శాతం ఖాతాలు తెరిచారని, మహిళల ఖాతాలు 53 శాతం ఉన్నాయని తెలిపింది.

4 years of Modi sarkar: More than 31.56 cr accounts opened so far under PMJDY

మే 2, 2018 నాటికి ఈ ఖాతాల్లో రూ.81,300 కోట్ల నిల్వలు ఉన్నట్లు పేర్కొంది. మోడీ నేతృత్వంలోని కేంద్రం తీసుకున్న పెద్ద నిర్ణయాల్లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అని పేర్కొంది.

English summary
Government on Wednesday claimed that more than 31.56 crore accounts have been opened so far under Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY). In a tweet highlighting the 4 years of achievement of Modi Government, Finance Ministry said that 59 per cent of Jan Dhan Accounts have been opened in the rural areas whereas 53 per cent of accounts belong to women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X