"అదానీ ఎంటర్‌ప్రైజెస్" జోరు.. 45 నిమిషాల్లోనే రూ.1000 కోట్ల సబ్‌స్క్రిప్షన్స్.. !

అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ జారీ చేసిన మూడో విడత నాన్‌ కన్వర్టబుల్ డిబెంచర్లు (NCDs) పెట్టుబడిదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. మొత్తంగా రూ.1000 కోట్ల విలువైన ఈ పబ్లిక్ ఇష్యూ కేవలం 45 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. మార్కెట్ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచేలా ఈ ఇష్యూ వేగంగా ముగియడం హాట్ టాపిక్ గా మారింది.

10 నిమిషాల్లోనే ప్రాథమిక ఇష్యూ క్లోజ్..

ఈ ఇష్యూలో మొదట ప్రకటించిన రూ.500 కోట్ల ప్రాథమిక భాగం కేవలం 10 నిమిషాల్లోనే పూర్తిగా నిండిపోయింది. అనంతరం అదనంగా తెరిచిన మొత్తానికి కూడా గంటలోపే భారీగా దరఖాస్తులు రావడంతో మొత్తం రూ.1000 కోట్ల ఇష్యూ పూర్తి అయింది. ఇది సంస్థ పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోందని భావిస్తున్నారు.

adani-enterprises-limited-1000-crore-worth-ncds-subscribed-in-just-45-minutes

ఇష్యూ తేదీలు, లిస్టింగ్ వివరాలు..

ఈ NCD పబ్లిక్ ఇష్యూ జనవరి 6న ప్రారంభమై జనవరి 19న ముగియాల్సి ఉంది. అయితే భారీ డిమాండ్ కారణంగా ముందుగానే సబ్‌స్క్రిప్షన్ ముగిసింది. ఈ డిబెంచర్లు బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈ (NSE) స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్ట్ కానున్నాయి. 'ఫస్ట్ కమ్ - ఫస్ట్ సర్వ్‌డ్' విధానం ప్రకారం కేటాయింపులు జరిగాయి. కాగా ఈ NCDలకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ వార్షికంగా 8.9% వడ్డీ రేటును ఆఫర్ చేసింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇది మంచి రాబడిగా భావిస్తున్నారు. అదనంగా ICRA, CARE Ratings సంస్థలు ఈ ఇష్యూకు AA- (స్టేబుల్ అవుట్‌లుక్) రేటింగ్ ఇచ్చాయి. ఈ రేటింగ్ కారణంగా రిటైల్, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు.

ఈ ఇష్యూ ద్వారా వచ్చిన నిధుల్లో:

75 శాతం - ఉన్న రుణాలను తీర్చడానికి.. మిగిలిన 25 శాతం - సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. దీని ద్వారా సంస్థ ఆర్థిక స్థిరత్వం మరింత బలపడనుంది. పెట్టుబడిదారులకు ఈ NCDలు వివిధ కాలపరిమితుల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో 24 నెలలు, 36 నెలలు, 60 నెలలు ఉన్నాయి. అంతే కాకుండా వడ్డీ చెల్లింపులో కూడా ఇన్వెస్టర్లకు ఎంపికలు ఉన్నాయి. త్రైమాసికంగా, సంవత్సరానికి ఒకసారి, లేదా కాలపరిమితి ముగిసిన తర్వాత ఒకేసారి.. పేమెంట్ చేసుకోవచ్చు.

గత ఇష్యూకు కూడా ఇదే తరహా స్పందన..

గత ఏడాది జూలైలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ జారీ చేసిన ₹1000 కోట్ల NCD ఇష్యూ కూడా కేవలం మూడు గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. అప్పటి నుంచి అదానీ గ్రూప్‌పై పెట్టుబడిదారుల నమ్మకం మరింత పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ దేశవ్యాప్తంగా మౌలిక వసతుల రంగంలో వేగంగా విస్తరిస్తోంది. ఈ ప్రాజెక్టులు గ్రూప్ భవిష్యత్ వృద్ధిపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతున్నాయని వెల్లడవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+