Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్యాబ్ యాప్‌ల 'అడ్వాన్స్ టిప్'దందా:ఊబెర్,ఓలా ర్యాపిడో పై సర్కార్ ఆగ్రహం..!

మీరు అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్లాలి. క్యాబ్ బుక్ చేస్తుంటే, 'డ్రైవర్‌కు ముందుగానే టిప్ ఇస్తే త్వరగా పికప్ చేసుకుంటారు' అనే ఆప్షన్ కనిపిస్తే? ఇదే ఇప్పుడు ఉబెర్, రాపిడో వంటి ప్రముఖ రైడ్-హెయిలింగ్ యాప్‌లలో తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఈ 'అడ్వాన్స్ టిప్పింగ్' విధానంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (CCPA) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. "వేగవంతమైన పికప్ కోసం టిప్ జోడించండి" అంటూ వినియోగదారులను ప్రోత్సహిస్తున్న ఈ విధానం నైతికంగా సరికాదని, ఇది క్యాబ్‌ల కోసం వేలంపాటను ప్రోత్సహించేలా ఉందని పేర్కొంటూ గతవారం ఉబెర్‌కు సీసీపీఏ నోటీసులు జారీ చేసింది.ఉబెర్ వాదన ప్రకారం,ముందుగా టిప్ ఇస్తే డ్రైవర్లు రైడ్‌ను అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉంటుందట. రాపిడో, ఓలా క్యాబ్స్ కూడా ఇదే తరహా విధానాలను అనుసరిస్తూ, త్వరగా రైడ్ దొరకాలంటే అదనంగా చెల్లించాలంటూ వినియోగదారులను బలవంతం చేస్తున్నాయి.

ప్రభుత్వం సీరియస్:
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయంపై స్పందిస్తూ, ఓలా, రాపిడోలతో సహా పలు రైడ్-హెయిలింగ్ యాప్‌లపై సీసీపీఏ దర్యాప్తు జరుపుతోందని ధృవీకరించారు. ఉబెర్ ఇప్పటికే సీసీపీఏ పరిశీలనలో ఉంది.సేవలు వేగంగా పొందేందుకు వినియోగదారులను ముందుగానే టిప్ చెల్లించమని బలవంతం చేయడం లేదా ప్రోత్సహించడం నైతికంగా తప్పని, దోపిడీతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి.టిప్ అనేది ప్రశంసకు గుర్తుగా ఉండాలి కానీ, సేవకు ముందస్తు షరతు కాకూడదని స్పష్టం చేశారు.

advance-tip-backlash-uber-rapido-under-ccpa-scanner-for-faster-pickup-fees

అడ్వాన్స్-టిప్పింగ్ ఎలా మొదలైంది?
ఆసక్తికరంగా, ఈ వివాదాస్పద విధానం 2022లో కర్ణాటక ప్రభుత్వ మద్దతు ఉన్న 'నమ్మ యాత్రీ' యాప్‌తో ప్రారంభమైంది. 2023లో రాపిడో దీనిని అనుసరించగా, గత ఏడాది చివర్లో ప్రకటించిన ఉబెర్, ఏప్రిల్ 2025లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇదిలా ఉంటే రాపిడో సంస్థ మాత్రం ఈ విధానాన్ని సమర్థించుకుంది. ఒక కస్టమర్ రైడ్ బుక్ చేస్తే.. 30 సెకన్లలోపు ఏ డ్రైవర్ అయినా సరే రైడ్‌ను అంగీకరించనప్పుడు మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తుందని చెప్పుకొచ్చింది.ఇక నమ్మ యాత్రీ యాప్‌లో కూడా టిప్‌ జోడించండి అనే పదాన్ని తీసేసి స్వచ్ఛందంగా టిప్ ఇవ్వండి అనే ఆప్షన్ చూపించడం ప్రారంభించింది. కస్టమర్ క్యాబ్ బుక్ చేస్తే వెంటనే ఈ అడ్వాన్స్ టిప్ అనే పదం కనిపించడం వల్ల తాను చెల్లించకపోతే మరొక కస్టమర్ చెల్లించి ఆ క్యాబ్‌ను బుక్ చేసుకుంటాడేమో అన్న భయాన్ని కలిగిస్తోంది.

వినియోగదారులు ఆగ్రహం:
ఓలా క్యాబ్స్, ఉబెర్, రాపిడో వంటి ప్రధాన రైడ్-హెయిలింగ్ సేవల 'అడ్వాన్స్ టిప్పింగ్' విధానంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఫిర్యాదులతో నిండిపోయాయిఈ అడ్వాన్స్ టిప్ మోసం బెంగళూరు ఆటోలతో మొదలైంది, నమ్మ యాత్రీ దీన్ని ప్రోత్సహించింది. ఇప్పుడు ఇది వైరస్‌లా వ్యాపించింది - ఉబెర్, రాపిడో కూడా దీన్ని చేపట్టాయి. మెరుగైన సేవ పేరుతో రైడ్‌కు ముందే అదనపు డబ్బు అడగడం పచ్చి దోపిడీ అని కొందరు ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు దీన్ని ఒక స్కామ్‌గా అభివర్ణిస్తున్నారు. ఊబెర్, రాపిడోలో ఈ అన్యాయానికి తెరదీశాయని అభిప్రాయపడ్డారు. కొన్ని సార్లు క్యాబ్ బుక్ చేసుకున్నాక టిప్ ఛార్జీలు 60శాతం లేదా 80శాతం చేరేవరకు డ్రైవర్లు రైడ్‌ను అంగీకరించరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒకప్పుడు ఆటో వాళ్లతో బేరాలు ఆడకుండా ఉండటానికే ఈ యాప్‌లు వాడాం. ఇప్పుడు మళ్లీ యాప్‌లోనే డ్రైవర్లతో బేరం ఆడాల్సి వస్తోంది, ఇది చాలా బాధాకరం అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

ఈ "అడ్వాన్స్ టిప్పింగ్" పద్ధతి వల్ల ఓలా, ఉబెర్, రాపిడో కంపెనీలు కేవలం ప్రభుత్వ పరిశీలనలోనే కాకుండా, తీవ్ర ప్రజా వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సమస్య ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+