Airtel: ఇకపై కొత్తగా రీఛార్జ్ చేసే వారికి మాత్రమే
ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తే వేల రూపాయల విలువైన AI సబ్‌స్క్రిప్షన్ ఉచితం అన్న ఆశతో ఉన్న ఎయిర్‌టెల్ (Airtel)వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది. దేశంలో ప్రముఖ టెలికం సంస్థ అయిన భారతి ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఇస్తున్న Perplexity AI Pro ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తిగా నిలిపివేసింది. ఇకపై రీఛార్జ్ చేసినా ఆ ఆఫర్ అందుబాటులో ఉండదని కంపెనీ స్పష్టంచేసింది.
గతంలో వినియోగదారులను ఆకర్షించేందుకు Airtel ఈ AI ఆఫర్‌ను భారీ హైలైట్‌గా ప్రచారం చేసింది. సాధారణంగా వేల రూపాయలు ఖర్చయ్యే Perplexity AI Pro సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తూ టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే అని అప్పుడే చెప్పిన ఎయిర్‌టెల్, 2026 జనవరి 16తో ఈ సదుపాయానికి ఫుల్ స్టాప్ పెట్టింది.

అయితే, ఇప్పటికే ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకున్న వినియోగదారులకు మాత్రం ఊరట లభించింది. వారు యాక్టివేషన్ తేదీ నుంచి పూర్తి ఒక సంవత్సరం పాటు Perplexity AI Pro సేవలను ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. కానీ ఇకపై కొత్తగా రీఛార్జ్ చేసే వారికి మాత్రం ఈ AI లాభం పూర్తిగా దూరమైంది.
ఇదిలా ఉండగా, యూజర్ల అసంతృప్తిని తగ్గించేందుకు Airtel మరో ప్రత్యామ్నాయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ Adobeతో భాగస్వామ్యం కుదుర్చుకుని, Adobe Express Premium సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులో జనరేటివ్ AI ఫీచర్లు, ప్రొఫెషనల్ డిజైన్ టూల్స్ వంటి అనేక ప్రీమియం సదుపాయాలు లభించనున్నాయి. అయినా, AI కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ చేసిన యూజర్లకు మాత్రం Airtel నిర్ణయం నిరాశ కలిగించే మార్పుగా మారిందనే చెప్పాలి.












Click it and Unblock the Notifications