Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. ఒక్క రోజులో ఇంత మార్పా..?
Todays Gold Rate: బంగారం ధరల్లో ఊహించని మార్పు చోటుచేసుకుంది. నిన్న(మే 20)తో పోల్చుకుంటే ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న 490 తగ్గిన తులం బంగారం ధర నేడు రూ. 2,400 పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 97,420 కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ పతనం, ఆర్థిక అసమానతల కారణంగా పసిడి ధరలు పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ పతనం, ఆర్థిక అసమానతల కారణంగా పసిడి ధరలు పెరిగిపోయాయి. నిన్నటితో పోల్చితే తులం బంగారం ధర రూ. 2,400 పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 97,420 కు చేరింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రామ్) రూ.9,742 వద్ద ఉంది. అయితే మే 20 న తులం బంగారం ధర రూ. 490 తగ్గటం గమనార్హం. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ప్రస్తుతం ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 2,200 పెరిగింది. ప్రస్తుతం తులం రూ.89, 300 వద్ద కొనసాగుతోంది. అంటే 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రామ్) రూ.8,930 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు కూడా అమాంతం పెరిగాయి. కిలో వెండి ధర రూ. 3000 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1,11,000 గా ఉంది.

ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నేపథ్యంలో పసిడి ధరలు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications